ఇదిలా ఎన్నికల ఫలితాలకి సంబంధించి కొత్త అనుమానాలు వినిపిస్తున్నాయి. రాత్రికి రాత్రి ఎన్నికల ఫలితాల్లో మార్పులు జరగడం పట్ల సరికొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై తాజాగా అనసూయ సంచలన ట్వీట్‌ చేశారు.

`మా`(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌) ఎన్నికలు ఇప్పుడు మరో కొత్త రచ్చకి తెరలేపుతున్నాయి. అటు మంచు విష్ణు వ్యాఖ్యలు, ఇటు మోహన్‌బాబు వ్యాఖ్యలు టాలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. చిరంజీవి టార్గెట్‌గా వీరి వ్యాఖ్యలున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఎన్నికల ఫలితాలకి సంబంధించి కొత్త అనుమానాలు వినిపిస్తున్నాయి. రాత్రికి రాత్రి ఎన్నికల ఫలితాల్లో మార్పులు జరగడం పట్ల సరికొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Scroll to load tweet…

దీనిపై తాజాగా అనసూయ సంచలన ట్వీట్‌ చేశారు. ఆమె ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌ నుంచి ఈసీ మెంబర్‌గా పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే రాత్రి ఓట్ల లెక్కింపు సమయంలో అనసూయ విజయం సాధించిందని, భారీ మెజార్టీతో గెలుపొందారనే వార్తలొచ్చాయి. కానీ సోమవారం లెక్కింపు ఫలితాల విషయంలో anasuya ఓడిపోయినట్టుగా ప్రకటించారు. దీంతో అనసూయ తన అనుమానాలను వ్యక్తం చేసింది. 

Scroll to load tweet…

ట్విట్టర్‌ ద్వారా ఆమె పంచుకుంటూ `క్షమించండి.. ఒక్క విషయం గురించి తెగ నవ్వొస్తుంది. మీతో పంచుకుంటున్నా ఏమనుకోవద్దే. నిన్న `అత్యధిక మెజారిటీ`, `భారీ మెజారిటీ` తో గెలుపు అని, ఈ రోజు ఓటమి అంటున్నారు. రాత్రికి రాత్రి ఏం జరిగి ఉంటుందబ్బా. అసలు ఉన్న సుమారు 900 ఓటర్స్ లో సుమారు 600 చిల్లర ఓటర్స్ లెక్కింపు రెండో రోజుకి వాయిదా వేయాల్సనంత టైమ్‌ ఎందుకు పట్టిందంటారు? ఆ.. ఏదో అర్థం కాక అడుగుతున్నా` అని పోస్ట్ పెట్టింది అనసూయ. 

Scroll to load tweet…

మరో ట్వీట్‌లో నేను ఎప్పుడూ రాజకీయాల్లో ఇన్‌వాల్వ్ కాలేనని తెలిపింది. రాజకీయాల్లో ఉంటే నిజాయితీగా ఉండలేమన్నారు. దాన్ని డీల్‌ చేసే టైమ్‌ తన వద్ద లేదని తెలిపింది. దాని గురించి ఆలోచించకుండా తన వర్క్ తాను చూసుకుంటానని తెలిపింది. అనసూయ చేసిన ఈ పోస్ట్‌ లు ఇప్పుడు మరో వివాదానికి తెరలేపుతున్నాయి. maa election ఫలితాల్లో ఏదో గోల్‌మాల్‌ జరిగిందనే అనుమానాలకు తావిస్తున్నాయి. `మా` ఎన్నికల్లో ఈసీ మెంబర్స్ కి సంబంధించి పది మంది manchu vishnu సభ్యులు, ఎనిమిది మంది ప్రకాష్‌రాజ్ ప్యానెల్‌ సభ్యులు గెలిచినట్టు తెలుస్తుంది. అయితే నిన్న రాత్రి మాత్రం 11 మంది ప్రకాష్‌రాజ్‌ ప్యానెల్‌, ఏడుగురు మంచు విష్ణు ప్యానెల్‌ సభ్యులు గెలిచినట్టు ప్రకటించారు. మరి ఈ రాత్రి ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా, సస్పెన్స్ గా మారింది. 

related news: దాసరి స్థానం మోహన్‌బాబు భర్తీ చేయాలన్న నరేష్‌..తన వల్ల కాదన్నా కలెక్షన్‌ కింగ్‌.. చిరుకి చెక్ పెట్టబోతున్నారా?