దాసరి స్థానం మోహన్‌బాబు భర్తీ చేయాలన్న నరేష్..తన వల్ల కాదన్నా కలెక్షన్ కింగ్.. చిరుకి చెక్ పెట్టబోతున్నారా?
మంచు విష్ణు ప్యానెల్ ఈసీ మెంబర్స్ అత్యధికంగా పది మంది గెలిచారని ప్రకటించారు. కానీ ఎన్నికల అనంతరమే అసలైన రాజకీయాలుస్టార్ట్ అయ్యాయని మంచు విష్ణు, మోహన్‌బాబు, నరేష్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. వీరి వ్యాఖ్యలు మున్ముందు టాలీవుడ్‌లో కొత్త వివాదాలకు దారి తీయబోతున్నాయనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
ఎన్నికల వరకు `మా` ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాలను హీటెక్కించాయి. ఎన్నికల వేడీ పీక్‌లోకి వెళ్లింది. `మా` కోసం పోటీలో ఉన్న మంచు విష్ణు ప్యానెల్, ప్రకాష్‌రాజ్ ప్యానెల్ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. దీంతో ఇన్నాళ్లు `మా`(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఒకటి ఉందనే విషయం తెలియని వారికి కూడా దాని గురించి తెలిసేలా చేశారు. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, జాతీయ స్థాయిలో చర్చకి తెరలేపినట్టయ్యింది. ఈ సారి `మా` ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రమేయం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది.
అయితే ఎన్నికలు ఆదివారంతో ముగిశాయి. సోమవారం పూర్తి ఫలితాలు ప్రకటించారు. మంచు విష్ణు ప్యానెల్ ఈసీ మెంబర్స్ అత్యధికంగా పది మంది గెలిచారని ప్రకటించారు. కానీ ఎన్నికల అనంతరమే అసలైన రాజకీయాలుస్టార్ట్ అయ్యాయని మంచు విష్ణు, మోహన్‌బాబు, నరేష్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. వీరి వ్యాఖ్యలు మున్ముందు టాలీవుడ్‌లో కొత్త వివాదాలకు దారి తీయబోతున్నాయనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. దీనిపై బండ్ల గణేష్ కూడా స్పందించి వాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సి ఉంది అన్నారు.
సోమవారం సాయంత్రం మీడియాతో మంచు విష్ణు, మోహన్‌బాబు మాట్లాడారు. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి తనని పోటీ నుంచి తప్పుకోవాలని చెప్పారని విష్ణు వెల్లడించారు. మరోవైపు మోహన్‌బాబు సైతం పేరు చెప్పకుండా తనని రెచ్చగొడుతున్నారని, తాను సింహం లాంటి వాడినని, సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసినా సునామీలా విజృంభిస్తుందన్నారు. మోహన్‌బాబు కూడా చిరంజీవినే టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ నేపథ్యంలో గత `మా` అధ్యక్షుడు నరేష్ మరో కొత్త అంశానికి తెరలేపారు. దాసరి స్థానం మోహన్‌బాబు భర్తీ చేయాలని తెలిపారు. మోహన్‌బాబు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దాసరి నారాయణరావు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండేవారని, ఆయన సమక్షంలో ఏ సమస్య ఉన్నా పరిష్కారం అయ్యేదని, కానీ ఆయన మరణించిన తర్వాత ఒక వ్యాఖ్యూమ్ ఏర్పడిందని, దాన్ని భర్తీ చేయాలన్నారు. ఆ స్థానం మోహన్‌బాబు భర్తీ చేయాలని ఆయన తెలిపారు.
చిరంజీవితో ఇటీవల వెకేషన్ మూడ్‌లో.
దీనికి మోహన్‌బాబు స్పందించారు. ఆ బాధ్యత తన వల్ల కాదన్నారు. అది దాసరి వల్లే అయ్యిందని, ఆయన స్థానం తనకు వద్దు అన్నారు. దాసరి స్థానం ఎవరూ భర్తీ చే తనకు తోచిన సాయం చేస్తానని తెలిపారు. అయితే నరేష్ వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకి తెరలేపుతుంది. ఇప్పటి వరకు దాసరి స్థానం చిరంజీవి భర్తి చేయాలని, ఆయనే చూసుకుంటున్నారనే కామెంట్లు ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి వినిపించాయి. ఇటీవల మురళీ మోహన్ కూడా అదే విషయాన్ని వెల్లడించారు. కానీ `మా` ఎన్నికల్లో చిరంజీవి తమకు వ్యతిరేకంగా పనిచేశారని, ఆయనకు చెక్ పెట్టే ప్రయత్నం జరుగుతుందని వినిపిస్తుంది.
ఇకపై మోహన్‌బాబు టాలీవుడ్‌లో పెద్ద దిక్కు పాత్రని తీసుకోబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. ఇదంతా ఓ పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతుందా? అనే చర్చకి తెరలేపినట్టవుతుంది. దీనిపై మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి స్పందన ఉంటుంది? చిరు స్పందిస్తారా? మెగాస్టార్‌ని సపోర్ట్ చేసే వారు ఎలా రియాక్ట్ అవుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా, ఉత్కంఠగా మారింది. ఈ పరిణామాలు ఎటువైపు దారితీయబోతున్నాయనేది హాట్ టాపిక్‌గా మారింది.
related news: `మా ఎన్నికలు` మోహన్‌బాబు తీవ్ర వ్యాఖ్యలు.. చిరంజీవిని ఉద్దేశించేనా?.. టాలీవుడ్‌లో దుమారం..