న్యూస్ రిపోర్టర్ గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ తన గ్లామర్ తో హాట్ యాంకర్ గా ఎదిగింది. బుల్లితెర కామెడీ షో జబర్థస్త్ సూపర్ సక్సెస్ కావడంతో ఆమె దశ తిరిగింది. ఆ షో సక్సెస్ లో ఆమె గ్లామర్ కూడా ఒక కారణం. పొట్టి బట్టలలో అనసూయను చూడడానికి ఎదురుచూసే ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తన కేరీర్ లో ఎదురైన ఒడిడుకులు, ఇబ్బందులు మరియు క్యాస్టింగ్ కౌచ్ గురించి అనసూయ కొన్ని ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. 

ఎంబీఏ హెచ్ ఆర్ చేసిన అనసూయ అసలు ఎటువంటి అవగాహనా లేకుండానే పరిశ్రమలోకి ఎంటర్ అయ్యారట. కస్టపడి అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాను అన్నారు. ఇక క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆమె మాట్లాడుతూ...ఎవరైనా ఒక రోల్ ఆఫర్ చేసి మనల్ని అడగ కూడనిది అడిగినప్పుడు,  ఆ పాత్రను వదులుకోవడమే. ఆ పాత్ర కాకపోతే దాని అమ్మలాంటి పాత్ర వస్తుందని ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యం లేని అమ్మాయిలే ఈ క్యాస్టింగ్ కౌచ్ కి బలవుతున్నారు, అని అన్నారు. గతంలో ఆమె కూడా ఫేవరేటిజం వలన రెండేళ్లు అవకాశాలు కోల్పోయానని చెప్పడం విశేషం. జబర్దస్త్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్న సమయంలో అనసూయ షో వదిలి వెళ్లిపోయారు. ఆమె స్థానంలో రష్మీ రావడం జరిగింది. ఎక్స్ట్రా జబర్దస్త్ రావడంతో అనసూయకు మళ్ళీ అవకాశం రావడం జరిగింది.

కాగా కొన్నాళ్లుగా అనసూయ సినిమాలలో కీలక రోల్స్ చేస్తున్నారు. రంగస్థలంలో ఆమె చేసిన రంగమ్మత్త పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. గత ఏడాది విడుదలైన కథనం మూవీలో ఆమె హీరోయిన్ గా చేయడం జరిగింది. దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో కూడా అనసూయ ఓ కీలక రోల్ చేస్తున్నారు. లెక్కకు మించిన బుల్లితెర షోలతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు.