బిగ్ బాస్ షోలో వైల్జ్ కార్డ్ ఎంట్రీకి టైమ్ లేదన్న చెప్పిన అనసూయ తాజాగా రంగస్థలం సినిమా షూటింగ్ కోసం టైమ్ కేటాయించని అనసూయ ఏకంగా టాలీవుడ్ స్టార్ హీరోలకే షాకులిస్తున్న యాంకర్ అనసూయ

తెలుగు బుల్లితెర యాంకర్స్ లో తనకంటబ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది అనసూయ. కాఫీ షోతో న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా ప్రారంభమైన అనసూయ.. ఎంటర్ టైన్మెంట్ ఛానెల్స్ లో డబుల్ మీనింగ్ ప్రోగ్రామ్స్ తో.. భారీ షోలతో.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తెలుగు టీవీ యాంకర్స్ ఎంత మందున్నా.. అనసూయ వేరయా అనే రేంజ్ కుు ఎదిగిన అనసూయ.. ఏకంగా తనపైనే.. వెండితెరపై పాటలు రాయించుకునే స్థాయికి ఎదిగిందంటే అది కేవలం తన గ్లామర్, యాటిట్యూడ్ వల్లనే.

తెలుగు బుల్లితెర హాట్ యాంకర్ గా ప్రస్తుతం టాప్ గేర్ లో దూసుకెళ్తున్న అనసూయకు సినిమాలలోనూ మంచి అవకాశాలే దక్కుతున్నాయి. సినిమాల్లో బిజీగా గడిపేయాలని అనుకుంటున్న అనసూయకు ఆమె కోరికకు తగ్గట్టుగానే భారీ సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి. అయితే ఇటు టీవీ షోలతో.. అటు చిన్నా చితకా సినిమాలతో బిజీగా వున్న అనసూయ ఇప్పుడు స్టార్ హీరోలు కూడా ఆమె కోసం వెయిట్ చేసేంత స్థాయికి ఎదిగిపోవడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.

తాజా సమాచారం మేరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా రూపొందుతున్న ‘రంగస్థలం’ సినిమాలో అనసూయకు సంబంధించిన కీలక సన్నివేశాల షూటింగ్ పెండింగ్ లో ఉంది అని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఆమెది చాల కీలకపాత్ర అని తెలుస్తోంది. దీంతో ఆమె డేట్స్ కోసం సుకుమార్ వెయిట్ చేస్తున్నాడని టాక్.అయితే అనసూయ వివిధ షోలతో బిజీగా ఉన్న నేపథ్యంలో రంగ స్థలంలో చరణ్ అనసూయల మధ్య చిత్రీకరించవలసిన సీన్స్ షూటింగ్ వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం సుకుమార్ కే కాకుండా చరణ్ కు కూడ అసహనాన్ని కలిగిస్తున్నట్లు ఫిలింనగర్ టాక్.

ఒకవైపు సమంత పెళ్ళి తేదీ దగ్గర పడుతున్న నేపధ్యంలో ఈ సినిమాను అత్యంత వేగంగా పూర్తి చేస్తున్నారు. అయితే ఈ షూటింగ్ షెడ్యూల్స్ కు అనసూయ కారణంగా బ్రేక్ పడటం చరణ్ కు ఏమాత్రం రుచించడం లేదని అంటున్నారు. దీనికితోడు అనసూయ మంచు విష్ణు మోహన్ బాబులు కలిసి నటిస్తున్న ఒక సినిమాలో మరో కీలక పాత్రకు ఎంపిక అయిన నేపధ్యంలో ఇంత బిజీ మధ్య అనసూయ చరణ్ ‘రంగస్థలం’ కు డేట్స్ ఇవ్వడం కొంత వరకు సమస్యగా మారింది అనుకోవాలి.

ఇప్పటి వరకు అనసూయ టాప్ హీరోలలో ఒక్క నాగార్జునతో మాత్రమే కలిసి నటించడం జరిగింది. అయితే ఈమె తన కెరియర్ లో మొట్టమొదటిసారిగా టాప్ యంగ్ హీరోలలో మొదటి వరసలో ఉన్న చరణ్ తో ‘రంగ స్థలం’ లో నటిస్తూ ఉండటం ఆమె క్రేజ్ ను సూచిస్తోంది. ఏమైనా ఒక టాప్ యంగ్ హీరోను అనసూయ వెయిట్ చేయించడం ఆశ్చర్యకరమే.