అసభ్యంగా మట్లాడారు.. క్లోస్ చేసింది అందుకే.. మళ్లీ ఓపెన్ చేస్తా (వీడియో)

అసభ్యంగా మట్లాడారు.. క్లోస్ చేసింది అందుకే.. మళ్లీ ఓపెన్ చేస్తా (వీడియో)

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే అనసూయ తన పేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలని మూసివేసింది. అందం, అభినయం అన్నీ ఉన్నఅనసూయ అవకాశలు అంతగా అందిపుచ్చుకోలేక పోయింది. అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ చేస్తు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం రంగస్థలంలోరాంచరణ్ తో కలిసి నటిస్తుంది. ఆ మధ్యన జరిగిన ఓ ఇన్సిడెంట్ వలన అనసూయపై సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు ఎదురయ్యాయి. నెటిజన్లు అనసూయని తిడుతూ కామెంట్లు పెడుతుండడంతో అనసూయ ఈ నిర్ణయం తీసుకుతుంది.

అనసూయ ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్ మూసివేసిన తరువాత తొలిసారి స్పందించింది. తాను ఎందుకు తన అకౌంట్లని మూసివేయవలసి వచ్చిందో వివరణ ఇచ్చింది. ఓ అభిమాని సెల్ఫీ అడగగా అనసూయ అతడి మొబైల్ ని పగలగొట్టినట్లు వార్తలు వచ్చాయి. ఆ ఘటనలో తన తప్పు లేదని అనసూయ అన్నారు. తన గురించి తెలియకుండానే ఓ మీడియా వర్గం తనని దోషిగా నిలబెట్టి ప్రయత్నం చేసిందని అనసూయ అన్నారు. దీనితో అభిమానుల్లోకి నెగిటివ్ సంకేతాలు వెళ్లాయి. వారు ఆగ్రహంతో అసభ్య కామెంట్లు పెడుతున్నారని అనసూయ అన్నారు. అందుకే తన సోషల్ మీడియా ఖాతాలని క్లోజ్ చేసానని అనసూయ అన్నారు. రంగస్థలం చిత్ర విడుదల తరువాత తిరిగి తన పేస్ బుక్, ట్విట్టర్ ని ఓపెన్ చేస్తానని అనసూయ అన్నారు.

                                          https://www.facebook.com/telugufilmnagar/videos/1865123580227969/?t=0

 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page