బుల్లితెరపై పాపులర్ అయిన ప్రోగ్రామ్స్ లో 'జబర్దస్త్' ఒకటి. అనసూయ వ్యాఖ్యాతగా వ్యవహరించే
బుల్లితెరపై పాపులర్ అయిన ప్రోగ్రామ్స్ లో 'జబర్దస్త్' ఒకటి. అనసూయ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఈ షోపై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. అయితే ఇప్పుడు ఈ షోలో చేసే కొన్ని స్కిట్ లు, కొన్ని డైలాగులు వల్గర్ గా ఉంటున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మహిళా సంఘాలు కూడా ఈ షోపై మండిపడిన సందర్భాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ షోతో హైపర్ ఆది బాగా పాపులర్ అయ్యాడు. సినిమాలలోసైతం అవకాశాలు దక్కిన్చుకున్తున్నాడు. తాజాగా హైపర్ ఆది.. అనసూయను హగ్ అడగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. స్కిట్ లో భాగంగా ఆది.. అనసూయను హగ్ అడుగుతాడు. అనసూయ తన చైర్ లో నుండి లేచి నుంచోగానే ఆది ఆమెను హగ్ చేసుకుంటాడు.
పైగా ఆమె కౌగిలిని స్వర్గమని పొగుడుతాడు. అయితే నిజానికి అనసూయకు ఈ సంఘటన కోపాన్ని తెప్పించిందట. కానీ స్క్రీన్ మీద అలా రియాక్ట్ అవ్వలేక సైలెంట్ గా ఉండిపోయిందని సమాచారం. ఆది ప్రవర్తనతో విసిగిపోయిన అనసూయ అతడికి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిందట. దీంతో ఆది ఆమెను క్షమాపణలు అడిగినట్లు తెలుస్తోంది.

