రేవంత్ రెడ్డి స్పీచ్ పై అనసూయ హాట్ కామెంట్.. అందులో నవ్వాల్సిన పనేముంది!
స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ తాజాగా చేసిన కామెంట్ ఆసక్తికరంగా మారింది. అదీ కాంగ్రెస్ అగ్రనేత రేవంత్ రెడ్డి స్పీచ్ పై షాకింగ్ గా స్పందించడం నెట్టింట హాట్ టాపిక్ గ్గా మారింది.
ప్రస్తుతం పొలిటికల్ ఫీవర్ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థులు చేస్తున్న ప్రచారాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. సభలు, ప్రచార కార్యక్రమాల్లో వారి ప్రసంగాలు హాట్ టాపిక్ గ్గా మారుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) బీఆర్ఎస్ ప్రచార తీరుపై మండిపడ్డారు. ఆయన స్పీచ్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై అనసూయ హాట్ కామెంట్ చేయడంతో మరింతగా ట్రెండ్ అవుతోంది.
అయితే, రేవంత్ రెడ్డి మీడియాను ఉద్దేశిస్తూ మాట్లాడరనేది అర్థమవుతోంది. ఆయన మాట్లాడుతూ.. ’లోఫర్ నా కొడుకులు ఛాన్సెల్స్ ఉన్నాయని అడ్డగోలు చేస్తే చూసుకుంట ఉంటా అనుకుంటున్నారేమో పండబెట్టి తొక్కి పేగులు తీస్తా.. మైక్ తీసుకొచ్చి మూతి ముందు పెడితే ఎవడో కూసిన కూతలకు వివరణ ఇచ్చే ఓపిక, తీరిక నాకు లేదు. అలాంటి లఫూట్ నాకొడుకులకు సమాధానం చెప్పను.’ అంటూ విరుచుకుపడ్డారు. ఈ స్పీచ్ లో రేవంత్ వాడిన పదజాలానికి ప్రత్యర్థులు, నాయకులు, నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు.
ఇక యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ స్పందిస్తూ.. ‘కొన్నిసార్లు మూడ్ అలానే ఉంటుంది.’ అంటూ హాట్ కామెంట్ చేసింది. లాఫింగ్ ఎమోజీస్ ను కూడా యాడ్ చేసింది. రేవంత్ స్పీ చ్ నవ్వాల్సిన అంశం ఏముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అనసూయ స్పందనతో ఈ వీడియో మరింతగా ట్రెండ్ అవుతోంది. ఆమె మీడియా వాళ్లకు ఇండైరెక్టర్ గా కౌంటర్ ఇంచ్చిందా? అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ సమయంలోనే రేవంత్ స్పీచ్ ను సమర్థిస్తున్నట్టు కనిపిస్తోంది. దీంతో ఆమె బీఆర్ఎస్ ను విమర్శించేందుకే అలాంటి కామెంట్ చేసిందా? అనే సందేహం కలుగుతోందంటున్నారు.
ఏదేమైనా అనసూయ ఎప్పుడూ తన కామెంట్లతో నెట్టింట కనిపిస్తూనే ఉంటుంది. గతం నుంచే కాంట్రవర్సీలకు కేరాఫ్ గా మారుతూ వస్తున్న విషయం తెలిసిందే. పలు విషయాల్లో ట్రోల్స్ ను ఎదుర్కొన్న.. ఎక్కడా తగ్గకుండా ధీటుగా సమాధానాలు చెబుతూనే ఉంది. మరోసారి రేవంత్ స్పీచ్ పై స్పందించడం ఆసక్తికరంగా మారింది. ఇక అనసూయ నటి టాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిన విషయం తెలిసిందే. వరుస చిత్రాలతో విభిన్న పాత్రల్లో నటిస్తూ అలరిస్తోంది. చివరిగా ‘రంగమార్తాండ’, ‘విమానం’, ‘ప్రేమ విమానం’ వంటి సినిమాల్లో మెరిసింది. ప్రస్తుతం ‘పుష్ప 2 : ది రూల్’, తమిళంలో ‘ఫ్లాష్ బ్యాక్’ అనే చిత్రంలో నటిస్తోంది.