బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ గారాల కూతురు సుహానా ఖాన్ బాలీవుడ్ ఎంట్రీపై గత కొంత కాలంగా అనేక రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై షారుక్ ఫ్యామిలీ పెద్దగా స్పందించలేదు. అయితే సుహానా బెస్ట్ ఫ్రెండ్ అయిన హీరోయిన్  అనన్యా పాండే క్లారిటీ ఇచ్చింది. 

షారుక్ సొంత ప్రొడక్షన్ లో నిర్మించనున్న ఒక చిన్న సినిమా ద్వారా సుహానా ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది అని రూమర్స్ వచ్చాయి.. అయితే ఆ రూమర్స్ కి అనన్య సింపుల్ గా చెక్ పెట్టేసింది. సుహానా ఇటీవల లండన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి న్యూయార్క్‌లోని ఓ ప్రముఖ ఫిలిం స్కూల్‌లో యాక్టింగ్ పై శిక్షణ తీసుకుంటున్నట్లు చెప్పారు. 

'తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పడం కాదు గాని సుహానా మంచి మనసున్న యువతి. యాక్టింగ్ లో చిన్నప్పటి నుంచే ఆమెకు కొంచెం అవగాహనా ఉంది. ఆమె మొదటి సినిమాలో అద్భుతంగా నటించగలదనే నమ్మకం' తనకుందని అనన్య తెలిపింది. అదే విధంగా ఇంకా ఆమె ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని కూడా ఈ స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2 బేబీ వివరణ ఇచ్చింది.