అనన్య పాండే ఇటీవల విడుదలైన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంలో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. బాలీవుడ్ ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా ప్రశంసలు అందుకుంది. క్యూట్ లుక్స్ లో యువతకు బాగా నచ్చేసింది. మరికొన్ని చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. బాలీవుడ్ లో కుర్ర హీరోయిన్లు పార్టీలు, పబ్బులు అంటూ ఎలా తిరుగుతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

అలా స్నేహితులతో కలసి నైట్ క్లబ్ లో పార్టీ చేసుకోవాలని వెళ్లిన అనన్య పాండేకు చేదు అనుభవం ఎదురైంది. అనన్య పాండేని ఆ నైట్ క్లబ్ సిబ్బంది గెంటేశారు. సదరు నైట్ క్లబ్ యాజమాన్యం దీని గురించి వివరణ ఇచ్చింది. మా క్లబ్ లో ఓ నిబంధన ఉంది. వయసు 24 ఏళ్ల కన్నా తక్కువ ఉన్న వారిని అనుమతించం. అందుకే అనన్య పాండేని అనుమతించలేదు అని యాజమాన్యం తెలిపింది. 

అనన్య పాండే వయసు కేవలం 20 ఏళ్ళు. ఇక చేసేది లేక నిరాశతో క్లబ్ నుంచి వెనుదిరిగింది. అనన్య పాండే తన తొలి చిత్రం నుంచే లేత పరువాలతో కుర్రకారు హృదయాలు దోచుకోవడం మొదలుపెట్టింది.