రోజు రోజుకి ఆర్ఆర్ఆర్ చిత్ర మ్యానియా పెరుగుతూనే ఉంది. త్వరలో ఆస్కార్ అవార్డ్స్ ఉండడంతో ఇంటెన్సిటీ మరింత ఎక్కువవుతోంది. అంతర్జాతీయ వేదికలపై పలు అవార్డులు ఆడుకుంటూ ఆర్ఆర్ఆర్ చిత్రం దేశం మొత్తానికి గర్వకారణంగా నిలుస్తోంది.

రోజు రోజుకి ఆర్ఆర్ఆర్ చిత్ర మ్యానియా పెరుగుతూనే ఉంది. త్వరలో ఆస్కార్ అవార్డ్స్ ఉండడంతో ఇంటెన్సిటీ మరింత ఎక్కువవుతోంది. అంతర్జాతీయ వేదికలపై పలు అవార్డులు ఆడుకుంటూ ఆర్ఆర్ఆర్ చిత్రం దేశం మొత్తానికి గర్వకారణంగా నిలుస్తోంది. ఇదిలా ఉండగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ క్రేజ్ కూడా ఆకాశాన్ని తాకే విధంగా మారింది. 

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ టీం విదేశాల్లో ఉన్నారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ లో భాగంగా రాంచరణ్ ఇటీవల గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షోలో పాల్గొన్నారు. ఈ షో ఎంత ప్రతిష్టాత్మకమైనదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటి షోలో పాల్గొనే అవకాశం రావడం చరణ్ కి దక్కిన అరుదైన గౌరవం అనే చెప్పాలి. 

రాంచరణ్ గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొన్న వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ వీడియోపై టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర ట్విట్టర్ లో స్పందించారు. ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటారు. ప్రతి అంశంపై ఆయన స్పందిస్తుంటారు. 

Scroll to load tweet…

రాంచరణ్ గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొన్న వీడియో షేర్ చేస్తూ.. అదిరిపోయే కితాబిచ్చారు. 'ఇతను గ్లోబల్ స్టార్' అని కామెంట్ పెట్టారు. రాంచరణ్ ని ఏకంగా గ్లోబల్ స్టార్ అని ఆనంద్ మహీంద్ర లాంటి వ్యక్తి ప్రశంసించడంతో మెగా ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయింది. 

మరోవైపు ఆర్ఆర్ఆర్ చిత్రం హెచ్ సి ఏ అవార్డ్స్ లో దుమ్ములేపింది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ లో ఆర్ఆర్ఆర్ చిత్రం ఏకంగా నాలుగు అవార్డులు కొల్లగొట్టింది. బెస్ట్ మూవీ, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, బెస్ట్ స్టంట్స్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగాల్లో ఆర్ఆర్ఆర్ చిత్రం హెచ్ సి ఏ లో అవార్డులు సొంతం చేసుకుంది. ఈ అవార్డ్స్ వేడుకలో కూడా రాంచరణ్ కి అరుదైన గౌరవం లభించింది. బెస్ట్ వాయిస్ ఓవర్ అవార్డుని ప్రకటించేందుకు రాంచరణ్ ప్రజెంటర్ గా వ్యవహరించారు.