రామ్ చరణ్ దగ్గర నేర్చుకుని తనతో కలిసి స్టెప్స్ వేశారు. దానికి సంబంధించిన వీడియోను కూడా ఆయన తన ట్విట్టర్‌లో షేర్ చేసారు
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఎప్పుడు ఏదో వార్తలో ఉంటూనే ఉంటారు. చాలా ఉత్సాహంగా అందరితో కలిసిపోతూంటారు. తాజాగా RRRలోని నాటు నాటు బేసిక్ స్టెప్స్‌ను రామ్ చరణ్ దగ్గర నేర్చుకుని తనతో కలిసి స్టెప్స్ వేశారు. దానికి సంబంధించిన వీడియోను కూడా ఆయన తన ట్విట్టర్‌లో షేర్ చేసుకున్నారు. అలాగే అధే సమయంలో RRR చిత్రానికి ఆస్కార్ రావాలని కూడా ఆయన యూనిట్‌కి అభినందనలు తెలియజేశారు. వివరాల్లోకి వెళితే...
దేశంలోనే తొలిసారి హైదరాబాద్‌లో జరిగిన ఈ ఫ్రీక్స్ రేసింగ్ ఘనంగా ముగిసింది. ఈ ఫ్రీక్స్ రేసింగ్ కు రామ్ చరణ్‌తో పాటు అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ వచ్చారు. వీరితో పాటు రాకింగ్ స్టార్ యష్, మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్, సిద్ధు జొన్నలగడ్డ వచ్చారు. ఇక క్రికెటర్స్ నుంచి అయితే మాస్టర్ బ్లాసర్ సచిన్ టెండూల్కర్, శిఖర్ ధావన్ విచ్చేశారు.
ఈ రేసింగ్‌ను చూడటానికి దేశంలోని ప్రముఖ సినీ, క్రీడా ప్రముఖులు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అలా వచ్చిన వారిలో ప్రముఖలు ఆనంద్ మహీంద్ర ఒకరు. ఈవెంట్‌కు వచ్చిన ఆయన రామ్ చరణ్‌ను ప్రత్యేకంగా కలవటం విశేషం. అలాగే మాస్టర్ బ్లాస్టర్ సచిన్, రామ్ చరణ్ ప్రత్యేకంగా కలుసుకున్నారు. చాలా సేపు మాట్లాడుకున్నారు. వారిద్దరూ కలిసి రేసింగ్ వెహికల్‌ను కూడా నడిపటం విశేషం. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి కూడా. సచిన్‌తో ఉన్న ఫొటోలను రామ్ చరణ్ తన సోషల్ మీడియాలోనూ షేర్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే RRRతో ఇంటర్నేషనల్ రేంజ్ ఐడెంటిటీని సంపాదించుకున్న రామ్ చరణ్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో RC 15 మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం కర్నూలులోని కొండా రెడ్డి బూరుజుపై చిత్రీకరణను జరుపుకుంటోంది.
