`ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలోని `నాటు నాటు` పాటకి గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వచ్చిన నేపథ్యంలో వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర, ఆప్‌ పార్టీ విభిన్నంగా అభినందనలు తెలిపారు. అవి వైరల్‌ అవుతున్నాయి. 

`ఆర్‌ఆర్‌ఆర్‌`లోని `నాటు నాటు` పాటకి ప్రతిష్టాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. దీనిపై సెలబ్రిటీలు స్పందిస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగా కార్పొరేట్‌ దిగ్గజం ఆనంద్‌ మహింద్ర, అలాగే ఆప్‌ పార్టీ ఆసక్తికరమైన, ఫన్నీ పోస్ట్ లు పెట్టారు. చిత్ర బృందానికి డిఫరెంట్‌గా అభినందనలు తెలిపారు. 

మరోవైపు కార్పొరేట్‌ దిగ్గజం ఆనంద్‌ మహింద్ర తనదైన స్టయిల్‌లో స్పందించారు. టీమ్‌కి విషెస్‌ తెలిపారు. `మీరు డాన్సు చేస్తే, ఇప్పుడు ప్రపంచమే మీతో కలిసి డాన్సు చేస్తుంది. ప్రతిష్టాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు సాధించినందుకు `ఆర్‌ఆర్‌ఆర్‌`టీమ్‌కి ధన్యవాదాలు. భారతదేశం గ్లోబల్‌ బ్రాండ్‌ ఎలా ఉండాలో మాకు చూపించినందుకు `నాటు నాటు`కి థ్యాంక్స్. మన దేశంలో ప్రజలంతా కలిసి పాడటం, డాన్సు చేయగలరు. వసుధైవ కుటుంబం మనది` అంటూ సెంటిమెంట్‌, ఎమోషన్స్ మేళవించి పోస్ట్ చేశారు. ఇప్పుడిది వైరల్‌ అవుతుంది. 

ఈ సందర్భంగా ఓ థియేటర్లలో నాటు నాటు పాటకి స్క్రిన్‌ వద్దకి వచ్చి అభిమానులు సెలబ్రేట్‌ చేసుకున్న వీడియోని పోస్ట్ చేశారు ఆనంద్‌ మహీంద్ర. ఇందులో అభిమానులు సంబరాలు చేస్తుకుంటున్నారు. ప్రస్తుతంఈ ట్వీట్‌ వైరల్‌ అవుతుంది. 

Scroll to load tweet…

మరోవైపు `ఆప్‌` పార్టీ సైతం `ఆర్‌ఆర్‌ఆర్‌`కి అభినందనలు తెలియజేసింది. ఇండియా గర్వపడే సందర్భం అని తెలిపింది. అది మామూలుగా కాదు, ఇన్‌స్టాగ్రామ్‌లో ద్వారా తెలిపింది. ఇందులో కీరవాణి ఫోటోని పంచుకోవడంతోపాటు `నాటు నాటు `సాంగ్‌ని పోస్ట్ చేసింది. అయితే ఇందులో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ స్థానంలో ఆప్‌ సీఎంల తలలను ఎడిటింగ్‌ చేసి పెట్టడం విశేషం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, పంజాబ్‌ సిఎం భగవత్‌ మన్న్ లు కలిసి డాన్సు చేస్తున్నట్టుగా క్రియేట్‌ చేసి ఈ పాటని పోస్ట్ చేయగా, ఇప్పుడిది ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుంది. 

View post on Instagram