Asianet News TeluguAsianet News Telugu

GGG Teaser : ‘గం గం గణేశా’ టీజర్ విడుదల.. కామెడీ, యాక్షన్ తో అదరగొట్టిన ఆనంద్ దేవరకొండ

ఆనంద్ దేవరకొండ లేటెస్ట్ ఫిల్మ్ ‘గం గం గణేశా’ చిత్రం నుంచి ఆసక్తికరమైన టీజర్ విడుదలైంది. కామెడీ, యాక్షన్ తో ఆనంద్ ఆకట్టుకుంటున్నారు. తాజా అప్డేట్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. 
 

Anand Deverakondas Gam Gam Ganesha movie Teaser Released NSK
Author
First Published Sep 15, 2023, 6:52 PM IST

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) ‘బేబీ’తో రీసెంట్ గా సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. అందులో ఆయన నటనకు ఆడియెన్స్  ఫుల్ ఫిదా అయ్యారు. ఇక ఇదే జోష్ లో  ఆనంద్ దేవరకొండ తన నెక్ట్స్ సినిమా ఇదే జోష్ లో తన నెక్ట్స్ ఫిల్మ్  ‘గం..గం..గణేశా’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్ర షూటింగ్ పూర్తైంది. ఇప్పటిదాకా తను చేయని యాక్షన్ జానర్ లో ఆనంద్ ఈ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తున్నారు. 

రీసెంట్ గానే Gam Gam Ganesha  నుంచి ఆనంద్ ఫస్ట్ లుక్ రిలీజై ఆకట్టుకుంది. ఇక తాజాగా టీజర్ ను విడుదల చేశారు. ఈరోజు హైదరాబాద్ లో టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. టీజర్ విషయానికొస్తే.. ఆనంద్ దేవరకొండ పెర్ఫామెన్స్ తో అదరగొట్టారు. ఓ వైపు కామెడీ సన్నివేశాల్లో నవ్విస్తూనే చివర్లో యాక్షన్ తో దుమ్ములేపారు. భారీ వెపెన్స్ ను వాడుతూ మోతమోగించాడు. ఏదో విషయమై ఆనంద్ ఓ ఊరికి వెళ్తాడు. అక్కడ అనుకోని పరిస్థితులతో ఓ డీల్ కుదుర్చుకుంటాడు. ఆ తర్వాత యాక్షన్ లోకి దిగుతాడు. ఇంతకీ ఆ డీల్ ఏంటీ? ఎందుకు ఆ ఊరికెళ్లాడనేది మిగితా అప్డేట్స్ తో తెలియనుంది. మొత్తానికి ఆనంద్ దేవరకొండ న్యూ లుక్ అదిరిపోయింది. పెర్ఫామెన్స్ ఇరగదీశాడని అర్థమవుతోంది. యాక్షన్ సన్నివేశాలు, సంగీతం కూడా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. 

విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఆనంద్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ‘దొరసాని’, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’, ‘పుష్పక విమానం’ వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ తెలుగు ప్రేక్షకులను అలరించారు. హిట్స్ తో పాటు ఫ్లాప్స్ ను చూస్తున్నాడు. అయినా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ఆడియెన్స్ ను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు ఆనంద్.  ‘బేబీ’ తర్వాత మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో రాబోతున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. త్వరలోనే మేకర్స్ రిలీజ్ డేట్ నూ అనౌన్స్ చేయనున్నారు. ఆనంద్ దేవరకొండ  సరసన హీరోయిన్ ప్రగతి శ్రీవాస్తవ నటించింది. అలాగే కరిష్మా, వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమాన్యూయల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios