Asianet News TeluguAsianet News Telugu

‘గం గం గణేశా’ నుంచి ఆనంద్ దేవరకొండ ఫస్ట్ లుక్.. లాంచ్ చేసిన సమంత.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్

‘బేబీ’తో సూపర్ హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ.. నెక్ట్స్ ‘గం గం గణేశా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా ఫస్ట్ లుక్ విడుదలై ఆకట్టుకుంటోంది. 
 

Anand Deverakondas Gam Gam Ganesha movie first look poster Released NSK
Author
First Published Sep 9, 2023, 7:07 PM IST

డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda)  ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ‘దొరసాని’, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’, ‘పుష్పక విమానం’ వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ తెలుగు ప్రేక్షకులను అలరించారు. హిట్స్ తో పాటు ఫ్లాప్స్ ను చూస్తున్నాడు. అయినా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ఆడియెన్స్ ను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు ఆనంద్. ఈ క్రమంలో రీసెంట్ "బేబీ" సినిమాతో  బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రేక్షకాదరణతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా దుమ్ములేపింది. 

ఇదే జోష్ లో తన నెక్ట్స్ ఫిల్మ్  ‘గం..గం..గణేశా’ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్ర షూటింగ్ పూర్తైనట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా తను చేయని యాక్షన్ జానర్ లో ఆనంద్ ఈ సినిమా చేస్తున్నారు. Gam Gam Ganesha సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. 

యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ‘గం గం గణేశా’ నుంచి తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. స్టార్ హీరోయిన్ సమంత (samantha)  పోస్టర్ ను లాంచ్ చేశారు.  ఇవాళ ఆనంద్ దేవరకొండ తన సోషల్ మీడియా అక్కౌంట్స్ ద్వారా ఈ విషయాన్ని పేర్కొన్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ నూ షేర్ చేశారు.  పోస్టర్ లాంచ్ చేసినందుకు సామ్ కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ చిత్రం గురించి మరిన్ని డిటేయిల్స్ మున్ముందు తెలియజేస్తామన్నారు. 

ఇక పోస్టర్ లో రెండు రైఫిల్స్ పట్టుకుని ఆనంద్ దేవరకొండ కనిపిస్తున్నారు. పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో గన్స్ పట్టుకున్న గ్యాంగ్స్, బాంబ్ బ్లాస్టింగ్ సీన్స్ కనిపిస్తున్నాయి. రాజావారి పల్లి అనే బోర్డు మీద రన్ - ఫన్ - గన్ అనే క్యాప్షన్ రాసి ఉంది. మొత్తంగా ఫస్ట్ లుక్ పోస్టర్ మూవీ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. "గం..గం..గణేశా" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేస్తూ ఇది యాక్షన్ మూవీనా ?, కామెడీ మూవీనా ? .. త్వరలో మనం తెలుసుకుందాం. మరిన్ని డీటెయిల్స్, ఎగ్జైటింగ్ అప్ డేట్స్ రాబోతున్నాయి అని క్యాప్షన్ రాశారు.

ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. సినిమాలోని నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ఆనంద్ దేవరకొండతో పాటు ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా, వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమాన్యూయల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios