యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ తాజాగా నటిస్తున్న చిత్రం ‘బేబీ’(Baby). ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో రూపుదిద్దుకుంటున్న మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ అందింది. ఈ సందర్భంగా క్రేజీ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.
టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. హిట్.. ఫ్లాప్ లతో లెక్కపెట్టకుండా వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటున్నాడు. విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్ గా ‘పుష్పక విమానం’, ‘హైవే’ చిత్రాలతో అలరించిన ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం ‘బేబీ. చిత్రంలో నటిస్తున్నారు.
మూవీలో హీరో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్న కొత్త సినిమా 'బేబీ'. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల నేషనల్ అవార్డ్ అందుకున్న సాయి రాజేష్ తదుపరి చిత్రం కావడం సినిమాకు ప్లస్. రీసెంట్ గా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ క్రేజీ అప్డేట్ అందించారు.
ఈనెల 21 (సోమవారం)న సాయంత్రం బేబీ చిత్ర టీజర్ ను విడుదల చేయబోతున్నారని అనౌన్స్ చేశారు. తాజాగా టీజర్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇందులో రోజ్ ఫ్లవర్ పెటల్స్ లో హీరోయిన్ వైష్ణవి వివిధ భావోద్వేగాలతో ఉన్నట్లు డిజైన్ చేశారు. ఈ పోస్టర్ డిఫరెంట్ గా ఉండి ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రతీ పోస్టర్ క్రియేటివ్ గా ఉండటంతో సినిమా టీజర్ పై అంచనాలు పెంచాయి. న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న 'బేబీ' మూవీపై సినీ ప్రియుల్లో మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. తుది హంగులు అద్దుకుంటున్న ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
