దొరసాని సినిమాతో మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆనంద్ దేవరకొండ అప్పుడే నెక్స్ట్ సినిమా ప్రాజెక్టులని లైన్ లో పెడుతున్నాడు. దొరసాని సినిమా తెలంగాణ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాజశేఖర్ కూతురు శివాత్మికా అందులో హీరోయిన్ గా నటించింది. 

అసలు మ్యాటర్ లోకి వస్తే ఆనంద్ ఎక్కువగా యూత్ కి కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక రెండవ సినిమా పూర్తిగా ఆంధ్ర రీజియన్ తరహాలో ఉంటుందని సమాచారం. కొత్త దర్శకుడు ఆ కొత్త కథకు దర్శకత్వం వహించనున్నాడు. వీలైనంత త్వరగా ఆనంద్ తన రెండవ సినిమాకు సంబందించిన అప్డేట్ ఇస్తాడని టాక్. 

అదే విధంగా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కథ వైపు కూడా కుర్ర హీరో మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం దొరసాని సినిమా ప్రమోషన్ ప్లానింగ్స్ లో బిజీగా ఉన్న ఆనంద్ మొదటి సినిమా రిజల్ట్ తెలియకముందే రెండవ సినిమాను షురూ చేస్తాడని వినికిడి.