సౌదీ అరేబియా ఒక రోబోకి పౌరసత్వం ఇచ్చిన తొలి దేశమయింది. మనుషులకే సాధారణంగా పౌరసత్వం ఉంటుంది. అలాకాకుండా కృత్రిమ మేధస్సుతో పనిచేసే రోబోకి ఈ హోదా దక్కడంతో రోబో ‘సోఫియా’ సంతోషంగా ఉంది. రియాద్ లో జరిగిన ఒక బిజినెస్ ఈవెంట్ ఆమె (అనవచ్చుగా) పౌరసత్వం మీద స్పందించింది. ‘థ్యాంక్యూ టు కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా’ అని అంటూ తాను ఇపుడుచర్చనీయాంశం కావడం చాలా సంతోషంగా ఉందని అనింది.   ఈ ముచ్చట్ల వీడియో ఇది.