ఆసీఫా......మన్నించు తల్లీ !

First Published 14, Apr 2018, 11:01 AM IST
an apology to Asifa of kathua
Highlights
ఆసీఫా......మన్నించు తల్లీ !

ఏ రాముడు చెప్పాడు రా
చిట్టి తల్లిని చెరచమని ?
ఏ దేముడు పూనాడు రా 
పసి మొగ్గని తుంచమని ?

ఏ వేదం రాసింది రా
పైశాచిక ఆనందం ?
ఏ పీఠం బోధించింది రా 
బలాత్కార పాఠం ?

మెదళ్ళను వదిలేసి
మొలల్లోకి  జారిందా పూనకం
మనిషిని దాటేసి 
మర్మాంగంలోకి చేరిందా ఉన్మాదం ?

"ఆఖరి సారంటూ" ....
"మరోసారంటూ" .....
"పందికొక్కుల్లా" మీదపడి .....

పాపం....
ఆడతనం తెలియని
పాప కదరా !
ఆడటమే తెలిసిన 
పాదం కదరా !!

అయినా 
జరిగిన స్కలనంతో
ఏ భగవంతుడిని అభిషేకిస్తారు ?
కార్చిన వీర్యంతో
ఏ గుడి దీపం వెలిగిస్తారు ?
వేలాడిన అంగంతో
ఏ మత గంటను మోగిస్తారు?

( మన్నించు తల్లీ........ఆసీఫా ! 
  ఇంతకన్నా ఎక్కువ ఈ దుర్మార్గులను ప్రశ్నించలేను)

బండారు రమేష్

loader