సడెన్‌గా తన ప్రియుడి ఫోటోలను సోషల్‌ మీడియా అకౌంట్ల నుంచి తొలగించింది అమీ జాక్సన్‌. దీంతో వీరిద్దరు బ్రేకప్‌ చెప్పుకున్నారనే వార్తలుఊపందుకున్నాయి.తాజాగా ఇప్పుడు మరోసారి అమీ జాక్సన్‌ ప్రేమలో పడిందట.

రజనీకాంత్‌(Rajinikanth) `2.0` హీరోయిన్‌ అమీ జాక్సన్‌(Amy Jackson) మళ్లీ ప్రేమలో పడింది. ఆమె ఇప్పటికే ఓ ప్రియుడికి బ్రేకప్‌ చెప్పిన ఈ భామ ఇప్పుడు మరోసారి డేటింగ్‌ చేస్తుంది. తనకు ప్రస్తుతం ఓ కుమారుడు ఉన్నప్పటికీ మరో యాక్టర్‌తో డేటింగ్‌ చేస్తుండటం హాట్‌ టాపిక్‌గా మారింది. అమీ జాక్సన్‌ బ్రిటీష్‌కి చెందిన అమీ జాక్సన్‌ తమిళ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. `మద్రసపట్టినమ్‌` చిత్రంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత హిందీలో `ఏక్‌ దీవానా థా` చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. రామ్‌చరణ్‌ నటించిన `ఎవడు` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో అమీ జాక్సన్‌ నటించిన ఏకైక చిత్రమది. 

వరుసగా తమిళ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న Amy Jackson `ఐ`, `తంగా మాగన్‌`, `గీతు`, `థెరి`, `అభినేత్రి` చిత్రాల్లో మెప్పించారు. `తుటక్‌ తుటక్‌ తుకియా`, `బూగీ మ్యాన్‌`, `ది విలన్‌` సినిమాలు చేస్తుంది. ఈ క్రమంలో ఆమె రజనీకాంత్‌తో `2.0`లో మెరిసింది. ఇందులో అమీ జాక్సన్‌ రోబోగా కనిపించడం విశేషం. తనదైన గ్లామర్‌తో కుర్రాళ్ళని కనువిందు చేసింది. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంది అమీ జాక్సన్‌. ఈ అమ్మడు సినిమాలకు గుడ్‌బై చెప్పి నాలుగేండ్లు అవుతుంది. 

అయితే సినిమాలు మానేశాక వ్యక్తిగత జీవితంలో బిజీ అయ్యింది. ఆమె బిజినెస్‌ మ్యాన్‌ జార్జ్ పనాయిటోతో ప్రేమలో పడింది. వీరిద్దరు కలిసి 2019 మేలో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. అయితే 2020లో మ్యారేజ్‌ చేసుకోవాలని ప్లాన్‌ చేశారు. కానీ ఆ లోపు కరోనా రావడంతో మ్యారేజ్‌ కాస్త వాయిదా పడింది. వరుసగా కరోనా నేపథ్యంలో వీరి మ్యారేజ్‌ పోస్ట్ పోన్‌ అవుతూ వచ్చింది. కానీ ఇద్దరు కలిసే ఉన్నారు. 2019 సెప్టెంబర్‌లోనే మగబిడ్డకి జన్మనిచ్చింది అమీ జాక్సన్‌. 

మగబిడ్డకి జన్మనిచ్చాక కొంత కాలం బాగానే ఉన్నా ఉన్నట్టుండి సడెన్‌గా తన ప్రియుడి ఫోటోలను సోషల్‌ మీడియా అకౌంట్ల నుంచి తొలగించింది అమీ జాక్సన్‌. దీంతో వీరిద్దరు బ్రేకప్‌ చెప్పుకున్నారనే వార్తలుఊపందుకున్నాయి. దీనిపై అమీ జాక్సన్‌ స్పందించకపోయినప్పటికీ అసలు విషయం అభిమానులకు అర్థం కావడంతో బ్రేకప్‌ విషయాన్ని కన్ఫమ్‌ చేసుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఇప్పుడు మరోసారి అమీ జాక్సన్‌ ప్రేమలో పడిందట. ఆమె బ్రిటీష్‌ నటుడు హంక్‌ ఎడ్ వెస్ట్ విక్‌తో డేటింగ్‌ చేస్తున్నట్టు వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

వీరిద్దరు సౌదీ అరేబియాలోని రెడ్‌ సీ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తొలిసారి కలుసుకున్నారని, వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే వీరిద్దరు రెండు నెలలుగా రహస్యంగా డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఇటీవల ప్రేమికుల రోజుని ప్యారిస్‌లో జరుపుకున్నట్టు సమాచారం. మరి ఈ సారైనా తమ రిలేషన్‌ని పెళ్లి వరకు తీసుకెళ్తుందేమో చూడాలి.