Asianet News TeluguAsianet News Telugu

విమాన ప్రయాణం తర్వాత ఎమీకి ఒంటిపై బట్టలు మాత్రమే మిగిలాయట

  • షూటింగ్ కోసం థాయ్ లాండ్ వెళ్లిన ఎమీ జాక్సన్
  • ముంబై ఎయిర్ పోర్టులో ఎమీ లగేజీ మిస్సింగ్
  • రెండు రోజుల వరకు లగేజీ దొరక్క థాయ్ లో ఇక్కట్లు
  • లగేజీ పోవడంతో కట్టుబట్టలతో మిగిలానన్న ఎమీ
amy jackson lost luggage in mumbai airport while travelling to thailand

బాలీవుడ్ లో తనకుంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విదేశీ భామల్లో ఎమీ జాక్సన్ కూడా ముందు వరుసలో ఉంటుంది. తాజాగా అమీ జాక్సన్‌ కు చేదు అనుభవం ఎదురైంది. ఓ షూటింగ్‌ కోసం ముంబై నుంచి బ్యాంకాక్ వెళ్తుండగా తనకు సంబంధించిన అత్యంత కీలకమైన లగేజీ బ్యాగులు మిస్సయ్యాయట. దాంతో చేతిలో హ్యాండ్ బ్యాగ్, ఒంటిపై నున్న బట్టలు తప్ప మరేం మిగల్లేదట. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లిన ఎమీ వెంటనే బ్యాంకాక్‌లోని స్థానిక మార్కెట్‌లో తనకు కావల్సిన వస్తువులు కొనుగోలు చేసిందట.

ఎయిర్ లైన్స్ అధికారుల తప్పిదం వల్లే నా లగేజి మరో చోటుకు పోయిందని ఏమీ ఆరోపించింది. “ముంబై ఎయిర్‌పోర్టు నుంచి తన దగ్గరికి రావాల్సిన లగేజీ మరో విమానంలో వెళ్లిపోయింది. దాని కోసం కనీసం రెండు రోజులు వేచి చూడాల్సి వచ్చింది. బ్యాంకాక్ మార్కెట్‌లో దుస్తులు, నాకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేశాను. నా లగేజీ మిస్ కావడం కొంత ఆశ్చర్యంగాను, మరికొంత బాధగాను అనిపించింది. ముంబై నుంచి బ్యాంకాక్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నా అనుభవంలో ఇలా జరగడం ఇదే తొలిసారి అని అమీ జాక్సన్ తెలిపింది.

సినిమా షూటింగ్ కోసం థాయ్‌లాండ్ వచ్చాను. చాలా సార్లు ఈ ప్రాంతానికి వచ్చాను. కానీ ఇలా జరుగడం మొట్టమొదటిసారి. షూటింగ్ సమయంలో లగేజ్ పోవడం వల్ల చాలా చిరాకు పడ్డాను. నా లగేజ్ పొరపాటున మరో విమానంలో పంపించారు. నేను చేసిన ఫిర్యాదు పరిగణనలోకి తీసుకొని లగేజి గురించి వెతికారు. అధికారులు వేగంగా స్పందించడంతో నాకు చాలా వరకు కష్టాలు తొలగిపోయాయి. ఎందుకంటే షూటింగ్ కావాల్సిన మెటీరియల్ అంతా నా లగేజీలోనే ఉంది.

ఒక్కోసారి హ్యాండ్ బాగ్ కూడా అందులోనే వేస్తాను. ఒకవేళ హ్యాండ్ బాగ్ కూడా అందులో ఉండి ఉంటే మరిన్ని కష్టాలు పడాల్సి వచ్చేది. లగేజీ పోవడం వల్ల బ్యాంకాక్ మార్కెట్‌ను సందర్శించే అవకాశం కలిగింది. దుస్తులకు సంబంధించిన షాప్స్ చాలా బాగా ఉన్నాయి. మంచి డ్రస్సెస్ కొనుగోలు చేసే అవకాశం కలిగింది. రెండో రోజే నా లగేజ్ నాకు చేరడంతో ఊపిరి పీల్చుకున్నా. అప్పుడు కానీ సంతోషం అనిపించలేదు. ఎయిర్ పోర్ట్ అధికారులకు థ్యాంక్స్ చెప్పాను. వారు కూడా పొరపాటుకు క్షమించమని కోరారు. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతాయని సర్ధిపెట్టుకొన్నాను.

లగేజ్ పోయిందనే వార్త లగేజ్ పోయిందనే వార్త తెలియగానే కంగారు పడలేదు. అర్జెంట్‌గా షూటింగ్‌కు కావాల్సిందేంటని ఆలోచించాను. దాని ప్రకారం నాకు కావాల్సిన కొనుగోలు చేశాను. దాంతో పెద్దగా కష్టమేమీ అనిపించలేదు.

దీంతో ఇంత జరిగినా షూటింగ్‌కు అవాంతరం కలుగకుండా చర్యలు తీసుకొన్న అమీ జాక్సన్‌పై చిత్ర యూనిట్ ప్రశంసలు వ్యక్తం చేసింది. విమానంలో లగేజ్ పోవడమనేది అదో కొత్త రకమైన అనుభవం. మరోసారి అలాంటి పరిస్థితి రావొద్దని కోరుకొంటున్నాను అని అమీ జాక్సన్ అంది.

Follow Us:
Download App:
  • android
  • ios