ఐపీఎల్ ఓపెనింగ్ సెరిమనిలో ఆడిపాడనున్న అమీ ఆరు నిమిషాల కోసం కోటి రూపాయలు చార్జ్ చేస్తున్న బ్రిటీష్ సుందరి ఈ ఫారిన్ పాపకు యూత్ లో యమా క్రేజ్
బ్రిటిష్ సుందరి అమీ జాక్సన్ ఇప్పుడు ఇండియాలో వన్ ఆఫ్ ది హాటెస్ట్ హీరోయిన్స్. అసలే విదేశీ యువతి కావడంతో అందాల ప్రదర్శన విషయంలో అమీ ఏ మాత్రం ఆలోచించే అవసరం లేదు. తెర వెనుక ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం 'రోబో 2.0' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది అమీ. రోబో 2.0 రిలీజ్ తర్వాత తన డిమాండ్ దేశవ్యాప్తంగా పదింతలు అవుతుందని ఆమె చాలా కాన్ఫిడెంట్‌గా వుంది.
కుర్రకారులో తనకి వున్న ఫాలోయింగ్ ను దృషష్టిలో పెట్టుకుని ఐపీఎల్ ఓపెనింగ్ సెరిమనీకి అమీ జాక్సన్‌ని ఎంచుకున్నారు. ఆరంభ కార్యక్రమాల్లో అమీ ఒక బాలీవుడ్ మెడ్లీ పర్‌ఫార్మ్ చేస్తుంది. ఆరు నిమిషాల పాటుండే ఈ కార్యక్రమం కోసం అమీకి కోటి రూపాయలు చెల్లించారని తెలుస్తోంది. ఇది క్లిక్ అయితే క్లోజింగ్ సెరిమనీకి కూడా అమీనే తీసుకునే అవకాశాలున్నాయి. అది కూడా తనకే ఇస్తే డిస్కౌంట్ ఇస్తానని కూడా అమీ చెప్పిందట.
