బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ ఇండియన్ చిత్రాలలో నటించింది. మోడల్ గా రాణించిన అమీ జాక్సన్ 2010లో మద్రాసు పట్టణం చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ బోల్డ్ బ్యూటీకి యువతలో మంచి ఫాలోయింగే ఉంది. అమీ జాక్సన్ ఏకంగా శంకర్ దర్శకత్వంలోనే నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఆమె నటించిన ఐ చిత్రం నిరాశపరచగా, గత ఏడాది నటించించిన 2.0 కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. 

ఇదిలా ఉండగా అమీ జాక్సన్ లండల్ లో తన ప్రియుడితో సెటిల్ అయిపోయింది. జార్జ్ పనయివోట్ అనే వ్యాపార వేత్తతో అమీజాక్సన్ కోనేళ్ళుగా ప్రేమలో ఉంది. కాగా ఈ ఏడాది ఆరంభంలో తాను గర్భవతిని అని ప్రకటించిన అమీ జాక్సన్ అందరిని ఆశ్చర్యపరిచింది. పెళ్లి కాకుండానే అమీ జాక్సాన్ ప్రెగ్నెంట్ అయింది. కాగా జార్జ్, అమీజాక్సన్ కు ఎంగేజ్ మెంట్ జరిగింది. 

జార్జ్, అమీ జాక్సన్ కుటుంబ సభ్యులు ఫ్యామిలీ ప్రెండ్స్ కావడంతో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇటీవల అమీజాక్సన్ తాను గర్భంతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు చేరువగా ఉంది. తాజాగా అమీ జాక్సన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 

హాస్పిటల్ బెడ్ పై తన బేబీతో అమీజాక్సన్ ఉండగా.. ఆమె ప్రియుడు జార్జ్ అమీ నుదుటిపై ముద్దు పెడుతున్నాడు. ఈ ఫోటోని షేర్ చేసిన అమీజాక్సన్ తాను తల్లి అయిన విషయాన్ని ప్రకటించింది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Our Angel, welcome to the world Andreas 💙

A post shared by Amy Jackson (@iamamyjackson) on Sep 23, 2019 at 3:36am PDT