'అమృతం'కోసం రంగంలోకి రాజ‌మౌళి,ట్రైలర్ వచ్చేసింది

 19 ఏళ్ళ త‌ర్వాత అమృతంకి సీక్వెల్‌గా అమృతం ద్వితీయం రాబోతుంది. ఈ సీక్వెల్ కు  మూర్ఖత్వానికి మరణం లేదు అనే క్యాప్షన్ పెట్టి వదులుతున్నారు . ఉగాది సందర్భంగా మార్చి 25 నుండి జీ5లో ప్రసారం కానుంది. 

Amrutham Dhvitheeyam web series Trailer

 
అప్పట్లో అమృతం సీరియల్ ఓ సెన్సేషన్.ఇప్పటికే ఎన్నో తెలుగు టీవి ఛానెల్స్‌ ఈ సీరియల్ ప్రసార హక్కులు కొని ప్రసారం చేస్తూనే ఉన్నాయి. ప్రసారం చేసినపుడల్లా ఈ సీరియల్‌కు భారీ ఎత్తున టీఆర్పీ రేటింగ్స్ వస్తూనే ఉన్నాయి.కామెడీ సిరీస్‌గా రూపొందిన ఈ సిరీస్‌లో అమృత‌రావు, అంజీ, స‌ర్వం పాత్ర‌లు తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిలో నిలిచాయి.  మొత్తంగా చెప్పాలంటే తెలుగు టెలివిజన్ సీరియల్ చరిత్రలో ‘అమృతం’ ఓ క్లాసిక్‌లా నిలిచిపోయింది. 

అందుకేనేమో  19 ఏళ్ళ త‌ర్వాత అమృతంకి సీక్వెల్‌గా అమృతం ద్వితీయం రాబోతుంది. ఈ సీక్వెల్ కు  మూర్ఖత్వానికి మరణం లేదు అనే క్యాప్షన్ పెట్టి వదులుతున్నారు . ఉగాది సందర్భంగా మార్చి 25 నుండి జీ5లో ప్రసారం కానుంది. ఈ సీరిస్ ని ప్రమోట్ చేయటానికి గుణ్ణం గంగరాజుకు సన్నిహితుడు అయిన రాజమౌళి రంగంలోకి వచ్చారు. ఆయన ఈ సీరిస్ ట్రైలర్ విడుదల చేసారు. ట్రైలర్ సైతం ఇంట్రస్టింగ్ గా సాగింది. మీరు ఇక్కడా ఆ ట్రైలర్ ని చూడవచ్చు.

 ‘‘19 ఏళ్ల క్రితం, కన్నీళ్లు తెప్పించే సీరియల్స్ శాసిస్తున్నప్పుడు.. ధైర్యం, దృఢవిశ్వాసం కలిగిన ఒక వ్యక్తి ఒక కామెడీ షోతో వచ్చి సరికొత్త ట్రెండ్‌కి నాంది ప‌లికాడు. ఐదు సార్లు ప్రసారమైన ఏకైక సీరియల్!! 270 మిలియన్ వ్యూస్.. గడిచిన కొద్ది నెలలుగా నెలకు 6 మిలియన్ వ్యూస్ సాధించిన సీరియల్. ఎప్పటికీ విజయం సాధించలేని హీరోలు అంజి, అమృతరావుల సక్సెస్ స్టోరీ ఇది. నిజంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ‘అమృతం’ ఒక స్థానాన్ని ఏర్పరుచుకుంది. దీనికి రెండో ఇన్‌స్టాల్‌మెంట్ కావాలని అభిమానులు కోరుకున్నారు. మొత్తానికి ఈ ఉగాది అమృతం ద్వితీయంను తీసుకొస్తోంది. ఇది నిజంగా అద్వితీయం’’ అని రాజమౌళి తన పోస్ట్‌లో పేర్కొన్నారు. 

తాజా సిరీస్‌లో హర్షవర్ధన్, శివన్నారాయణ, వాసు ఇంటూరి, రాగిణి తమ పూర్వ పాత్రలే పోషించగా.. ఎల్బీ శ్రీరామ్ అంజి పాత్రలో, సత్యక్రిష్ణ అమృతం భార్య సంజీవిని పాత్రలో కనబడనున్నారు. కాశీ విశ్వనాథ్, రాఘవ కీలకమైన పాత్రలు పోషించారు. ఈ సారి అమృత విలాస్ ఎలా ఉండ‌బోతుందో చిన్న ట్రైల‌ర్ ద్వారా చూపించారు. ఈ ట్రైల‌ర్‌ని ఎస్ఎస్ రాజ‌మౌళి త‌న ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు.  ‘అమృతం ద్వితీయం’ నిజంగా అద్వితీయం అన్నారు. దాని గొప్పతనాన్ని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios