అందాల తెలుగు సినీ హీరోయిన్ అనుష్క తాజాగా నటించిన భాగమతి చిత్రంలో ఐఏఎస్ అధికారిణి పాత్ర పోషించింది. ఈ సినిమాలో అనుష్క వేషధారణ చూస్తే ఓ అధికారిణికి ఉండాల్సిన హుందాతనం అంతా కనిపిస్తుంది. తన చీరకట్టు బొట్టు వ్యవహారశైలి అంతా ఓ ఐఏఎస్ అధికారిణి తరహాలో చాలా హుందాగా తెరకెక్కించి చూపించాడు దర్శకుడు అశోక్.

 

ఇక అశోక్ అనుష్కతో ఈ ఐఏఎస్ పాత్రకోసం వేయించిన కాస్టూమ్య్ డిజైన్ చూస్తే రియల్ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాళి గుర్తుకురాక మానదు. సహజంగా వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాళి వేషధారణ కూడా ఇలానే వుంటుంది. ఈ వేషధారణ చూస్తే అచ్చం భాగమతి మూవీలో అనుష్క వేషధారణ కూడా అలానే అనిపిస్తుంది. సహజంగానే మూవీ లవర్ అయిన అమ్రపాళి ఇటీవలే అనుష్క నటించిన బాహుబలి సినిమా కోసం తన వాళ్లకు చూపించేందుకు ఏకంగా వరంగల్ నగరంలోని ఓ థియేటర్ బుక్ చేసింది. అలాంటి అనుష్క తన మాదిరిగా వేషధారణతో సినిమాలో కనిపించడం పట్ల ఆమె ఎలా ఫీలవుతుందో ఏమో కానీ ఆమెలానే అనుష్క వేషధారణ చూపించడం దర్శకుడు అశోక్ ఆలోచన అని అనుకుంటున్నారు.

 

రీల్ లైఫ్ లో అనుష్కకు ఎంత ఫాలోయింగ్ వుందో.. రియల్ ఆఫీసర్ ఆమ్రపాళికి కూడా అంతే ఫాలోయింగ్ వుంది. రీసెంట్ గా ఆమ్రపాళికి కశ్మీర్ కు చెందిన ఐపీఎస్ అధికారి 2011 బ్యాచ్ కు చెందిన సమీర్ శర్మతో పెళ్లి కూడా సెట్ అయింది. దీంతో మరో క్రేజీ ఆఫీసర్ అయిన ఆమ్రపాళి కూడా తెలంగాణలో మంచి పేరున్న ఐఏఎస్, ఐపీఎస్ జంట స్మిత సభర్వాల్, అకున్ సభర్వాల్ ల తరహాలో.. ఐపీఎస్ ను వివాహం చేసుకున్న ఐఎఎస్ ఆఫీసర్ గా మంచి ఆఫీసర్స్ కపుల్ గా మారనున్నారని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు.