టాలీవుడ్ బెస్ట్ డాన్సర్స్ గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్, అల్లు అర్జున్, చరణ్ లలో సాయి పల్లవి ఎవరితో డాన్స్ చేయాలనుకుంటుంది. ఈ ప్రశ్నకు ఆమె ఆన్సర్ ఇచ్చారు.  


కేవలం టాలెంట్ తో ఎదిగిన అరుదైన నటి సాయి పల్లవి. ఈ జనరేషన్ హీరోయిన్స్ లో ఆమె చాలా ప్రత్యేకం. ఫిదా, ఎంసీఏ, శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరీ చిత్రాలతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. తమిళ అమ్మాయి అయినప్పటికీ తెలుగులోనే ఎక్కువ గుర్తింపు దక్కింది. టాలీవుడ్ ఆడియన్స్ సాయి పల్లవిని అక్కున చేర్చుకున్నారు. సహజ నటన, గొప్ప డాన్సింగ్ స్కిల్స్ ఆమెకు స్టార్డం తెచ్చిపెట్టాయి. సాయి పల్లవి టాలీవుడ్ టాప్ డాన్సర్స్ గా ఉన్న ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లతో నటిస్తే చూడాలని. ఆ హీరోలతో ఒక ఎనర్జిటిక్ సాంగ్ చేయాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అయితే ప్రేక్షకుల కోరిక తీరడం అంత ఈజీ కాదు. వారి చిత్రాల్లో ఆమెకు ఛాన్స్ వచ్చినప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది. 

కాగా సాయి పల్లవి ఈ ముగ్గురు హీరోల్లో ఎవరితో కలిసి డాన్స్ చేయాలనుకుంటున్నారనేది ఆసక్తికరం. ఈ ప్రశ్నకు సాయి పల్లవి సమాధానం చెప్పారు. తాజాగా సాయి పల్లవి ఒక టాక్ షోలో పాల్గొన్నారు. సదరు షోలో హోస్ట్... ఎన్టీఆర్, చరణ్, బన్నీలలో ఎవరి పక్కన మీరు డాన్స్ చేయాలని కోరుకుంటున్నారని అడగ్గా... సాయి పల్లవి మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ చెప్పింది. ముగ్గురితో ఒక సాంగ్ చేస్తా అంటూ షాక్ ఇచ్చింది. 

నిజానికి ఇది డిప్లొమాటిక్ ఆన్సర్. ఒకరి పేరు చెబితే మిగతా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. అందుకే సాయి పల్లవి తెలివిగా ముగ్గురు హీరోలతో ఒక సాంగ్ చేస్తా అని సమాధానం చెప్పారు. కాగా సాయి పల్లవి నటించిన విరాటపర్వం విడుదలై చాలా కాలం అవుతుంది. ఆమె మళ్ళీ తెలుగు ఆడియన్స్ ని పలకరించలేదు. ఇది అభిమానుల్లో ఒకింత అసహనం కలిగిస్తుంది. కాగా పుష్ప 2లో నటిస్తన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం లేదు. మంచి సబ్జెక్ట్స్ దొరక్కే గ్యాప్ వచ్చిందని ఆ మధ్య సాయి పల్లవి ఓ సందర్భంలో చెప్పారు. డిమాండ్ ఉన్నప్పటికీ ఆచితూచి సినిమాలు చేస్తున్నారు సాయి పల్లవి. 

Scroll to load tweet…

ఈ మధ్య కాలంలో సాయి పల్లవి నటించిన శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరీ మంచి విజయాలు సాధించాయి. ఇక చివరిగా తమిళ చిత్రంలో గార్గిలో ఆమె నటించారు. ప్రస్తుతం శివ కార్తికేయన్ కి జంటగా ఒక చిత్రం చేస్తున్నారట. అజిత్, విజయ్ ల సంక్రాంతి చిత్రాలు తునివు, వారిసు ఆఫర్స్ సాయి పల్లవి రిజెక్ట్ చేశారనే ప్రచారం జరిగింది.