మాస్ హీరోకి పోటీగా దిగుతున్నాడు!

ammagarillu movie release date locked
Highlights

శ్రీమ‌తి స్వ‌ప్న స‌మ‌ర్ప‌ణ‌లో స్వాజిత్ మూవీస్ బ్యాన‌ర్ లో నాగ‌శౌర్య‌, బేబి షామిలి జంట‌గా

శ్రీమ‌తి స్వ‌ప్న స‌మ‌ర్ప‌ణ‌లో స్వాజిత్ మూవీస్ బ్యాన‌ర్ లో నాగ‌శౌర్య‌, బేబి షామిలి జంట‌గా కె.ఆర్ స‌హా నిర్మాత‌గా  రాజేష్  నిర్మిస్తోన్న చిత్రం `అమ్మమ్మగారిల్లు`. సుంద‌ర్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తాజాగా ఈసినిమా సెన్సార్  ప‌నుల‌ను పూర్తిచేసుకుంది. సింగిల్ క‌ట్ కూడా  లేకుండా క్లీన్ 'యు' స‌ర్టిఫికెట్  ల‌భించింది.  అనుకున్న‌ట్లుగానే ఈనెల 25న భారీ ఎత్తున‌ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది.

చ‌క్క‌టి కుటుంబ క‌థా చిత్రం కావ‌డంతో స్వ‌చ్ఛ‌మైన తెలుగు టైటిల్ మూవీ కావ‌డంతో సినిమాకు మంచి క్రేజ్ వ‌చ్చిందని.. సినిమాపై అంచనాలు భారీ గానే ఉన్నాయని.. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే సెన్సార్ వారు కూడా మా సినిమా చూసి మెచ్చుకోవ‌డం చాలా ఆనందంగా ఉందని దర్శకుడు తెలిపారు. అయితే ఇదే రోజున మాస్ మహారాజ రవితేజ నటించిన 'నేల టికెట్టు' సినిమా కూడా థియేటర్లలో విడుదల కానుంది. మరి రవితేజతో పోటీలో ఈ యంగ్ హీరో నిలుస్తాడో లేదో చూడాలి!

loader