దిలీప్ ను క్షమించి ఆ నటికి అన్యాయం చేశారు: కమల్ హసన్

AMMA wrong in taking Dileep back without consulting all members says kamal hassan
Highlights

అమ్మలో దిలీప్ ను తిరిగి చేర్చుకుంటామని చెప్పి బాధిత నటికి అన్యాయం చేశారు. అసోసియేషన్ లో ఉన్న మిగిలిన వారి అభిప్రాయలు తెలుసుకోకుండా సొంత నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. 

ఓ నటిని లైంగికంగా వేధించిన ఆరోపణలతో మలయాళ నటుడు దిలీప్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే బెయిల్ మీద బయటకు వచ్చిన దిలీప్ ఎప్పటిలానే తన సినిమా షూటింగ్ లలో పాల్గొంటున్నాడు. దీంతో మలయాళీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(అమ్మ) అతడికి తిరిగి సభ్యత్వం ఇస్తున్నట్లు వెల్లడించింది. 

ఈ నిర్ణయం పలువురు అభిప్రాయాలకు విరుద్ధంగా ఉండడంతో దిలీప్ ను తిరిగి అమ్మలో చేర్చుకుంటే తము రాజీనామా చేస్తామని బాధిత నటితో పాటు ఆమెకు సపోర్ట్ నిలిచిన కొందరు నటీమణులు తమ రాజీనామా పత్రాలు అమ్మకు సమర్పించారు. ఇప్పటికీ ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా స్టార్ హీరో కమల్ హాసన్ ఈ విషయంపై స్పందించారు.

'అమ్మలో దిలీప్ ను తిరిగి చేర్చుకుంటామని చెప్పి బాధిత నటికి అన్యాయం చేశారు. అసోసియేషన్ లో ఉన్న మిగిలిన వారి అభిప్రాయలు తెలుసుకోకుండా సొంత నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఇది సరైనది కాదని అమ్మలో ఉన్నవారు కూడా అంటున్నారు. చాలా మంది ఆర్టిస్టులు కలిస్తే ఈ సంఘం ఏర్పడింది. అందరి సహకారం లేకుండా ముందుకు నడవలేదు. సంఘం కేవలం ఒక వ్యక్తిది అయితే దిలీప్ ను క్షమించు కానీ ఓ సమూహంగా ఉన్నప్పుడు అతడిని వెనక్కి తీసుకునే నిర్ణయం అందరితో చర్చించాలి'' అంటూ స్పష్టం చేశారు. 
 

loader