బిగ్ బాస్ రియాలిటీ షోకి ప్రజల్లో ఉన్న క్రేజ్ రీత్యా పలు టీవీ మరియు యూట్యూబ్ ఛానల్స్ బిగ్ బాస్ ఇంటిలో కొనసాగుతున్న కంటెస్టెంట్స్ కుటుంబీకులను కూడా ఇంటర్వ్యూ చేస్తున్నారు. బిగ్ బాస్ రియాలిటీ షోపై వారి అభిప్రాయం అడిగి తెలుసుకుంటున్నారు. తాజాగా అమ్మ రాజశేఖర్ భార్య రాధా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడంతో పాటు...పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. 

బిగ్ బాస్ షో ప్రారంభంలో బిగ్ బాస్ ఓ  నిర్వహించారు. ఈ టాస్క్ లో అమ్మ రాజశేఖర్ కి వ్యతిరేకంగా యాంకర్ లాస్య, టీవీ 9 రిపోర్టర్ దేవి నాగవల్లి మాట్లాడారు. ఇక లాస్య అమ్మ రాజశేఖర్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆయన కామెడీ ఓవర్ గా ఉందని. రాజశేఖర్ ప్రవర్తన నచ్చడం లేదని చెప్పి మెడపట్టి బయటికి గెంటింది. వయసులో పెద్దవాడైన అమ్మ రాజశేఖర్ ని ఈ విషయం బాగా బాధ పెట్టింది. అవమానంగా ఫీలైన ఆయన ఏడవడంతో పాటు...తనని హౌస్ నుండి బయటికి పంపివేయాలని కోరుకున్నాడు. 

ఇదే విషయంపై యాంకర్ లాస్య పట్ల రాజశేఖర్ భార్య రాధ తన అసహనం బయటపెట్టింది. వృత్తి పరంగా నా భర్త అనేక మంది అమ్మాయిలతో పనిచేశారు. కానీ లాస్య చాలా రిజర్వ్డ్ అనుకుంటా...నా భర్తపై నిందలు వేసింది. చేయని తప్పు తనపై వేసినందుకు రాజశేఖర్ తట్టుకోలేకపోయారు. నింద వేసేటప్పుడు అది కరెక్టా కాదా అని తెలుసుకోవాలి. చేయని నేరాన్ని తనపై మోపడంతో అమ్మ రాజశేఖర్  ఎమోషనల్ అయ్యారని రాజశేఖర్ భార్య లాస్య చెప్పుకొచ్చారు. 

నాగార్జున ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించిన అమ్మ రాజశేఖర్ అరగుండు, సగం మీసం తీసుకున్నారు. ఈ సాహసం చేసిన ఆయన ఈవారం ఎలిమినేషన్ నుండి సేవ్ కావడం జరిగింది. తమిళుడు అయినా కూడా హౌస్ లో తన మార్కు కామెడీతో అమ్మ రాజశేఖర్ బాగానే నెట్టుకొస్తున్నారు.