ఈసారి బాలీవుడ్ హోలీ వేడుకలపై శ్రీదేవి మరణం చాలా ప్రబావం చూపింది. అతిలోక సుందరి ఆకస్మిక మృతితో బాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకోవడంతో దాదాపు అందరు స్టార్స్ సెలబ్రేషన్స్‌ కు దూరంగానే ఉన్నారు.

 

బాలీవుడ్ లో ఈసారి హోలీ సంబరాలు కేవలం అమితాబ్ ఫ్యామిలీ మాత్రం జరుపుకుంది. సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ తమ ఇంట్లో చిన్న ఈవెంట్ నిర్వహించారు. హోళికను దహనం చేశారు. అనంతరం జయా బచ్చన్ అమితాబ్‌కు తిలకం దిద్దారు. హోళి సందర్భంగా హోళికను దహనం చేసే సాంప్రదాయం అమితాబ్ ఫ్యామిలీ తరతరాలుగా కొనసాగిస్తోంది. హోళికను దహనం చేసే ముందు చిన్న పూజా కార్యక్రమం నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అమితాట్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. హోళిక దహనం అనంతరం జయా బచ్చన్ తన భర్తకు తిలకం దిద్దారు. ఉత్తరాదిన జరిగే హోళీ వేడుకలో ఇదీ ఒక భాగమే. అమితాబ్ బచ్చన్ తన మనవరాలు ఆరాధ్యకు తిలకం దిద్దుతున్న ఫోటోకు... చాలా క్యూట్ పిక్ అంటూ అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.

ఇక దక్షిణాదిన చెన్నైలో రజనీకాంత్ తన కుటుంబంతో కలిసి హోళీ వేడుక జరుపుకున్నారు. ఈ వేడుకలో రజనీ ఇద్దరు కూతుళ్లు, భార్య పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు రజనీ డాటర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. హ్యాపీ మూమెంట్స్ హోళీ సందర్భంగా రజనీకాంత్ నివాసంలో హ్యాపీ మూమెంట్స్. హోళీ వేడుక అనంతరం తన కూతురు సౌందర్యతో కలిసి సెల్ఫీ దిగిన సూపర్ స్టార్ రజనీకాంత్.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్యతో కలిసి హైదరాబాద్‌లో హోళీ వేడుక జరుపుకున్నారు. ఈ ఫోటోను ఉపాసన అభిమానుల కోసం షేర్ చేశారు.