నేటితో 75 వసంతాలు పూర్తి చేసుకున్న బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ ఈసారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోని అమితాబ్ బచ్చన్ మాల్దీవులకు వెకేషన్ కు వెళ్లిన బిగ్ బి అండ్ ఫ్యామిలీ

బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ 75 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. అయితే... ఈసారి పుట్టినరోజు వేడుకలకు దూరంగా వుంటున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో... ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. సాధారణంగా ప్రతియేటా బచ్చన్ పుట్టినరోజున... ఆయన అభిమానులు, సన్నిహితులు, బంధుమిత్రులు ఇలా అంతా... పుట్టినరోజు వేడుకలకు హాజరై శుభాకాంక్షలు తెలుపుతుంటారు. కానీ ఈసారి మాత్రం బిగ్ బీ ఎవరికీ అందుబాటులో లేకుండా.. పోయారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ యేడాదిలోనే అమితాబ్ కుటుంబంలో పెద్ద ఒకరు చనిపోవడమే తను పుట్టినరోజు జరుపుకోకపోవటానికి అసలు కారణమని అంతా భావించారు. అయితే... అమితాబ్ మాత్రం అసలు కారణం తన ముద్దుల మనవరాలు ఆరాధ్యతో వెల్లడించాడట.

ఇప్పటికే అమితాబ్ ఫ్యామిలీ అంతా వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. ఇక అమితాబ్ తన మనవరాలు ఆరాధ్యతో మాట్లాడుతూ... దాదాజీ పుట్టిన రోజు పార్టీ ఎందుకు లేదని అడగ్గా.. “ముంబైలో వుంటే.. అభిమానులు, సహనటులు, బంధుమిత్రులంతా వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంటారని.. అలా చాలా ఇబ్బంది పడాల్సి వస్తోందని ఈ సారి అలా జరగకుండా.. ఎక్కడికన్నా వెళ్తే ఏ బాధా వుండదని ఈ మాల్దీవుల వెకేషన్ కు ప్లాన్ చేసినట్లు చెప్పారని” సమాచారం.