Asianet News TeluguAsianet News Telugu

బాలయ్యకు హ్యాండ్, మెగాస్టార్ కు షేక్ హ్యాండ్

  • మెగాస్టార్ 151 సైరా నరసింహారెడ్డి సినిమాలో అమితాబ్ బచ్చన్
  • అమితాబ్ ను గతంలో రైతు సినిమా కోసం సంప్రదించిన బాలకృష్ణ
  • బాలయ్య సినిమాలో చిన్న పాత్ర కావడంతో డేట్స్ ఇవ్వని బిగ్ బీ
  • తాజాగా చిరంజీవి చిత్రంలో పాత్ర నచ్చడంతో చిరు మూవీకి అమితాబ్ డేట్స్
amithab bachan accepts mega star offer and rejects balayya offer

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహ రెడ్డి మీద ఫస్ట్ లుక్ లాంచ్ తోనే.. భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంపై ఇప్పటి నుంచే బోలెడు లెక్కలు వేస్తున్నారు అభిమానులు, ఇండస్ట్రీ జనాలు. బాలీవుడ్ రేంజ్ లో భారీ ప్రాజెక్ట్ కి సన్నాహాలు జరుగుతున్న టైం లో ఈ చిత్రంలో  బాలీవుడ్ బాద్ షా అమితాబ్ బచ్చన్ నటిస్తుండటం విశేషం.

 

అమితాబ్ ఎంట్రీ ఎ సినిమాకి ఎంతైనా ఊపుని ఇచ్చేదే అని చెప్పాలి. చిరు 151 వ చిత్రం బాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్న చరణ్ కి అమితాబ్ కంటే బెస్ట్ సోర్స్ దొరకలేదు. అయితే రైతు చిత్రం కోసం బాలయ్య అమితాబ్ ని పాత్ర అడిగితే చెయ్యలేదు కానీ ఈ చిత్రానికి ఎలా సంతకం పెట్టారు అనేది కొందరి వాదన.

 

నిజానికి రైతు చిత్రం కోసం కృష్ణ వంశీ చెప్పిన స్టొరీ అమితాబ్ కి బాగా నచ్చింది కానీ అందులో కేవలం తనది రెండు నిమిషాల పాత్ర. సౌత్ ఇండియా లో ఒక సినిమాలో భారీగా ఒక ఇంటరెస్టింగ్ పాత్ర చెయ్యాలని చూస్తున్నారు అమితాబ్ బచ్చన్ కానీ దానికి వ్యతిరేకంగా ఒక చిన్న రోల్ కోసం తాను డేట్స్ ఇవ్వడం అమితాబ్ కి ఇష్టం లేదు.

 

చిరు కొత్త సినిమాలో ఓకే చెప్పడానికి మరొక స్ట్రాంగ్ కారణం కూడా ఉంది. ‘బుడ్డా ‘ప్ర‌మోష‌న్ కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన అమితాబ్ అదే ఫంక్ష‌న్‌లో గెస్ట్ గా హాజ‌రైన చిరుకి ఓ మాట ఇచ్చాడు. ‘మీరు 150వ సినిమా చేస్తే అందులో నేను ఓ పాత్ర పోషిస్తా’ అన్నాడు. బిగ్ బీ అంత‌టివాడు ఆ ఆఫ‌ర్ ఇస్తే ఎవ‌రైనా ఎలా వ‌దులుకొంటారు.  అందుకే చరణ్ అమితాబ్ ని ఈ రకంగా లాక్ చేసాడు. ఈ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కి గురువుగా అమితాబ్ కనిపిస్తారు. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్ లు వీరిద్దరి మధ్యనా చాలా అల్టిమేట్ గా ఉన్నాయి అనీ అందుకే అమితాబ్ ఆసక్తి చూపించారు అని తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios