మారోసారి ఇండియన్ స్టార్ సెలబ్రెటీ ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్ కి గురైంది. ఊహించని విధంగా అమితాబ్ బచ్చన్ ప్రొఫైల్ ఇమేజ్ గా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫోటో ఉండటంతో అంతా షాక్ కి గురయ్యారు. పైగా లవ్ పాకిస్థాన్ అంటూ బయో లో క్యాప్షన్ ఇవ్వడంతో ఈ న్యూస్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. 

అంతే కాకుండా ట్విట్టర్ హ్యాక్ అనంతరం ట్వీట్ కూడా వెలువడింది. అమితాబ్ అకౌంట్ ని హ్యాక్ చేసింది టర్కిష్ హ్యాకర్ గ్రూప్ అయ్యిల్దిజ్ టీమ్ అని పేర్కొన్నారు. పిన్ చేసిన ట్వీట్ లో వారు ఐస్ ల్యాండ్ కి హెచ్చరిక చేసే విధంగా ఈ పనికి పాల్పడినట్లు తెలుస్తోంది. 

ఐస్ ల్యాండ్ రిపబ్లిక్ తమ ఫుట్ బాల్ ఆటగాళ్లపై చూపించిన ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాం... మేము సాఫ్ట్ గా మాట్లాడతాము.. కానీ పెద్ద ఆలోచనలతో సైబర్ క్రైమ్ దాడులకు పాల్పడతామని పేర్కొన్నారు. హ్యాకింగ్ పై తమ ఉనికిని చాటుకోవడానికి టర్కిష్ సైబర్ క్రైమ్ టీమ్ ఈ విధంగా హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు వారి స్టైల్ లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.