బాలీవుడ్ మెగాస్టార్ గా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై వెలుగుతున్న అమితాబ్ బచ్చన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రీల్ లైఫ్ లో కనిపించే మంచి గుణమే రియల్ లైఫ్ లో కూడా కనిపిస్తుంటుంది. రైతులకు సాయం అందిస్తూ జవాను కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం చేస్తుంటారు. 

ఇక అమితాబ్ ని చూసేందుకు అభిమానులు ప్రతి ఆదివారం ఆయన ఇంటికి చేరుకుంటూ ఉంటారు. అమితాబ్ కూడా వీలైనంత వరకు ఫ్యాన్స్ ను కలుసుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల వర్షం పడినా కూడా అభిమానులు అక్కడే అమితాబ్ కోసం వెయిట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇక అమితాబ్ అయితే ఎమోషనల్ అయ్యారు. 

ఇలాంటి ప్రేమను పొందుతున్నందుకు చాలా అదృష్టవంతుడిని వర్షంలాగే మీ ప్రేమ కూడా జోరున తనపై కురిసిందని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఎన్నాళ్లయినా బిగ్ బి పై అభిమానం తగ్గదని నెటిజన్స్ కూడా పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.