#Nagarjuna సూపర్ హిట్ రీమేక్ లో అమితాబ్
అమితాబ్ సైతం ఈ పాత్ర నచ్చి చాలా ఇష్టపడి ఓకే చెప్పారంటున్నారు. అయితే ఆల్రెడీ ఓటిటిలో లభ్యమవుతున్న ఈ సినిమా ఏ మేరకు వర్కవుట్ అవుతుందని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

నాగార్జున, తమిళ స్టార్ హీరో కార్తిల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘ఉపిరి’. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 25 మార్చ్ 2016 న భారీ అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అయ్యింది. ఫ్రెంచ్‌లో క్లాసిక్ అనిపించుకున్న ‘ది ఇన్‌టచబుల్స్’ అనే సినిమాను.. తెలుగులో, ఇక్కడి ఆలోచనా విధానానికి, పరిస్థితులకు, నేపథ్యానికి అనుగుణంగా మార్చుకొని, అసలు కథను, ఆత్మను ప్రేక్షకులకు పరిచయం చేయాలన్న ఆలోచన చాలా మందికి నచ్చింది. నాగార్జున కార్తీల జర్నీని సినిమా మొత్తం అలా చూస్తూండిపోయేలా సీన్స్ డిజైన్ చేసారు. కార్తీ పాత్రలోని చలాకీతనం, అల్లరి, నాగార్జున పాత్రలోని స్వచ్ఛమైన నిండుతనం.. ఈ రెండింటినీ ప్రతిబింబించేలా వీరి ప్రయాణంలో వచ్చే సన్నివేశాలు నవ్విస్తూ, ఏడిపిస్తూ, ఒక అద్భుతమైన అనుభూతినిస్తూ సాగిపోతూ కట్టిపడేసాయి. అయితే ఆ సినిమా ఇప్పుడు హిందీలో రీమేక్ కాబోతోందని సమాచారం.
ప్రెంచ్ ఒరిజినల్ వెర్షన్ ని కాకుండా తెలుగులో వాడిన సీన్స్, స్క్రీన్ ప్లే తో సినిమా ప్లాన్ చేసినట్లు తెలిసింది. నాగార్జున పాత్రలో అమితాబ్ బచ్చన్, కార్తీ క్యారెక్టర్ కు రాజ్ కుమార్ రావుని తీసుకుంటున్నట్లు తెలిసింది. కరణ్ జోహార్ నిర్మాతగా భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమాకు డైరక్టర్ ఇంకా ఫైనల్ కాలేదని వినికిడి. అమితాబ్ సైతం ఈ పాత్ర నచ్చి చాలా ఇష్టపడి ఓకే చెప్పారంటున్నారు. అయితే ఆల్రెడీ ఓటిటిలో లభ్యమవుతున్న ఈ సినిమా ఏ మేరకు వర్కవుట్ అవుతుందని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
చిత్రం కథేమిటంటే....ఓ ప్రమాదంలో పూర్తిగా కాళ్ళు, చేతులు పనిచేయకుండా వీల్‌చైర్‌కే అతుక్కుపోయిన కోటీశ్వరుడైన విక్రమ్ ఆదిత్య (నాగార్జున). ఆయనతో ఉంటూ తన బాగోగులను చూసుకునేందుకు ఒక సరైన వ్యక్తి కోసం ఇంటర్వూలు చేస్తూంటాడు. అప్పుడే జైలు నుంచి బయటకొచ్చిన శీను (కార్తి), విక్రమ్ దగ్గర ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళతాడు. రోజూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉండే ఓ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పెరిగిన శీను, విక్రమ్‌కి నచ్చడంతో అతడి బాగోగులను చూసుకునే ఉద్యోగం సంపాదిస్తాడు. డబ్బుంటేనే సంతోషం ఉంటుందనుకునే శీను, సంతోషం అంటే డబ్బులో లేదు,కావాల్సిన మనుష్యుల మధ్యే అని తెలుసిన ఆదిత్య కలిసి చేసే ప్రయాణమే ‘ఊపిరి’. ఈ ప్రయాణంలో ఏమేం జరిగాయి? ఎవరెవరి జీవితాలు ఎలా మారాయి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసే తెలుసుకోవాలి.