బాలీవుడ్ మెగాస్టార్ గా చెరగని ముద్ర వేసుకున్న బిగ్ బి అమితాబ్ బచ్చన్ మంచి పనుల్లో ఎప్పుడు ముందుంటారు. ప్రజల్లోకి మంచి విషయాలను తీసుకెళ్లడంలో అమితాబ్ తనవంతు సహాయంగా పలు సందేశాత్మక యాడ్స్ లలో నటిస్తుంటారు. 

ఇక రీసెంట్ గా 70 కోట్ల వరకు ట్యాక్స్ చెల్లింది తన బాధ్యతను నిర్వర్తించారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను అమితాబ్ బచ్చన్ 70కోట్లు పన్ను చెల్లించినట్లు ఆయన ప్రతినిధి తెలియజేశారు. అమితాబ్ యాడ్స్ ద్వారా మంచి ఆదాయాన్ని పెంచుకోవడమే కాకుండా పలు సేవా కార్యక్రమాల్లో విరాళాలు అందిస్తుంటారు. 

ఈ ఏడాది ముజఫర్ నగర్ లోని 2084 మంది రైతుల అప్పులను తీర్చి.. పుల్వామా దాడిలో మరణించిన సైనికుల కుటుంబాలకు పది లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు.