Kamal Hasan Vikram: బయటపడ్డ కమల్ హాసన్ విక్రమ్ ప్లానింగ్.. ఎవరు నటిస్తున్నారో తెలుసా..?

కమల్ హాసన్ విక్రమ్ మూవీ అయితే రిలీజ్ కు రెడీ అయ్యింది. కమల్ హాసన్ చాలా గ్యాప్ తరువాత థియేటర్లలో సందడి చేయబోతున్న సినిమా విక్రమ్. ఈ సినిమా గురించి ఓ సీక్రేట్ బయటకు వచ్చింది. 

Amitabh In Kamal Hasan Vikram Movie

కమల్ హాసన్ విక్రమ్ మూవీ అయితే రిలీజ్ కు రెడీ అయ్యింది. కమల్ హాసన్ చాలా గ్యాప్ తరువాత థియేటర్లలో సందడి చేయబోతున్న సినిమా విక్రమ్. ఈ సినిమా గురించి ఓ సీక్రేట్ బయటకు వచ్చింది. 

కమలహాసన్ హీరోగా  ఆయన సొంత బ్యానర్లో  తెరకెక్కిన సినమా విక్రమ్. విశ్వరూపం తరువాత కమల్ నుంచి సినిమాలు రాలేదు.  లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. చాలా గ్యాప్ తరువాత కమల్ చేస్తున్న సినిమా కావడంతో ఈమూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఫ్యాన్స్ కూడా వెయ్యి కళ్లతో ఈ సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు. 

ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, నరేన్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ విషయం అఫీషియల్ గాతెలిసిందే. కాని అయితే ఇప్పటివరకూ ఈ సినిమా టీమ్ సస్పెన్స్ లో ఉంచిన ఒక విషయం తాజాగా బయటికి వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడని టాక్ కోలీవుడ్ లో గట్టిగా నడుస్తోంది. సెకండాఫ్ లో ఆయన పాత్ర ఎంట్రీ ఉంటుందని సమాచారం. 

ఆడియన్స్ కు సర్ ప్రైజ్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో టీమ్ ఈ విషయాన్ని బయట పెట్టలేదట. ఇంతవరకూ కమల్ ఎన్నో ప్రయోగాలు చేస్తూ వచ్చారు. ఆ జాబితాలో ఈ సినిమా చేరుతుందని అంటున్నారు. జూన్ 3 వ తేదీన తమిళంతో పాటు  తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విక్రమ్ సినిమా రిలీజ్ కాబోతోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios