ట్రాజడీ కింగ్‌ దిలీప్‌ కుమార్‌తో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. బిగ్‌బీ అమితాబ్‌, అక్షయ్‌ కుమార్‌, చిరంజీవి, మోహన్‌లాల్‌, ఎన్టీఆర్‌, మహేష్‌, వెంకటేష్‌, రవితేజ, వంటి సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

ట్రాజడీ కింగ్‌ దిలీప్‌ కుమార్‌తో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ముఖ్యంగా హిందీ చిత్ర సీమ షాక్‌కి గురయ్యారు. ఇండియన్‌ సినిమాలో ఇదొక చీకటి రోజంటూ అభివర్ణిస్తుంది. బిగ్‌బీ అమితాబ్‌, అక్షయ్‌ కుమార్‌, చిరంజీవి, మోహన్‌లాల్‌, ఎన్టీఆర్‌, మహేష్‌, వెంకటేష్‌, రవితేజ, వంటి సినీ ప్రముఖులు దిలీప్‌కుమార్‌ మృతి పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తూ, వారి అభిమానులకు, కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్ల ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. 

`భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఓ శకం ముగిసింది. ఇలాంటి గొప్ప నటుడిని మళ్లీ చూడలేం. కొన్నేళ్లపాటు తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్న లెజెండ్‌ మృతి బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా` అని చిరంజీవి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఫోటోని అభిమానులతో పంచుకున్నాడు. 

Scroll to load tweet…

`దిలీప్‌ కుమార్‌ సర్‌ ఇప్పుడు మాతో లేరు. అతను ఎప్పటికే లెజెండే. అతని వారసత్వం ఎప్పటికీ మన గుండెల్లో కొనసాగుతోంది. అతని కుటుంబ సభ్యలను నా ప్రగాడ సానుభూతి` అని వెంకటేష్‌ తెలిపారు. 

Scroll to load tweet…

`భారతీయ సినీ పరిశ్రమ విలువను పెంచిన దిగ్గజ నటుడు దిలీప్‌కుమార్‌. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు అనిర్వచనీయమైనవి` అని ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు. 

Scroll to load tweet…

మహేష్‌బాబు స్పందిస్తూ, `దిలీప్‌ కుమార్‌ టైమ్‌లెస్‌ లెజెండ్‌. ఆయన అద్భుతమైన ప్రకాశవంతమైన నటన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నటులకు ప్రేరణగా కొనసాగుతుంది. ఆయన మరణం భారతీయ సినిమాకి భారీ నష్టం. దిలీప్‌ సర్‌ మిమ్మలి భయంకరంగా మిస్‌ అవుతున్నాం` అని అన్నారు.

Scroll to load tweet…

రవితేజ స్పందిస్తూ, దిలీప్‌ కుమార్‌ ప్రపంచ సినిమాపై చెరగని ముద్ర. వెండితెరపై దయ చూపిన గొప్పనటుడు. అతని మనోజ్ఞతను, పాండిత్యం అసమానమైనది. ఆయన నటనతో శాశ్వతంగా జీవిస్తారు` అని పేర్కొన్నారు.

Scroll to load tweet…

బిగ్‌బీ స్పందిస్తూ, `ఒక ఇనిస్టిట్యూట్‌ పోయింది. ఎప్పుడైన భారతీయన సినీ చరిత్ర రాయాల్సి వస్తే.. దిలీప్‌ కుమార్‌ ముందు.. దిలీప్‌ కుమార్‌ తర్వాత అని చెప్పాలి. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా` అని ట్వీట్‌ చేశారు అమితాబ్‌.

Scroll to load tweet…

`భారతీయ సినిమాకు లెజెండ్‌ దిలీప్‌ కుమార్‌ ఆద్యుడు. ఆయన ఎప్పటికీ చిరంజీవిగా మిగిలి పోతారు` అని మోహన్‌లాల్‌ తెలిపారు.

Scroll to load tweet…

`ఈ ప్రపంచానికి చాలామంది హీరోలై ఉండొచ్చు. దిలీప్‌కుమార్‌ సర్‌ మాలో స్ఫూర్తి నింపిన గొప్ప హీరో. సినీ పరిశ్రమకు చెందిన ఒక శకం ఆయనతో ముగిసిపోయింది. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా` అని అక్షయ్‌ తీవ్ర సంతాపం తెలిపారు. 

Scroll to load tweet…