బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్ నిత్యం తన అభిమానులకు దగ్గరగా ఉంటారు. సోషల్‌ మీడియా ద్వారా వారికి మరింత చేరువ అవుతుంటారు. వారితో ఛాటింగ్‌ చేయడంతోపాటు, తమ కొత్త సినిమాల అప్ డేట్స్, ఇతర ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను కూడా పంచుకుంటూ వారిని ఖుషీ చేస్తుంటారు. తాజాగా ఓ అరుదైన ఫోటోని పంచుకున్నారు బిగ్‌బీ. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

ఇందులో అమితాబ్‌ యంగ్‌గా ఉన్నారు. డెనిమ్‌ జాకెట్‌ ధరించారు. నల్ల ప్యాంట్‌ వేసుకున్నారు. రైట్‌ సైడ్‌ ప్యాంట్‌కి ఓ గన్‌ ఉంది. అలాగే చేతిలో ఓ గన్‌ ఉంది. ఇది ఓ సినిమా కోసం ఫోటో షూట్‌ అని తెలుస్తుంది. ఈ ఫోటోని పంచుకుంటూ అమితాబ్‌ స్పందిస్తూ, `ఎప్పుడూ తీయని చిత్రం. స్టయిల్డ్, ఫోటో షాట్‌, టైటిల్డ్... కానీ ఎప్పుడూ చేయలేదు.. ప్రిటీ` అని పేర్కొన్నారు. 

ఈ ఫోటో ఓ సినిమా కోసం చేసిన ఫోటో షూట్‌ అని, కాకపోతే ఆ సినిమా పట్టాలెక్కలేదని అర్థమవుతుంది. అందుకే అది ఏ సినిమాలోనిదనే విషయాన్ని వెల్లడించలేదు. ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం మరో సరదా ఫోటోని పంచుకున్నారు అమితాబ్‌. గ్రీన్‌ మ్యాట్‌పై రెండు చేతులు బిగించి ఫుల్‌ జోష్‌లో కనిపించారు. సెట్‌లో తీసిన ఫోటో ఇది. ఈ సందర్భంగా ఆయన చెబుతూ, `స్వింగ్‌ సమయం.. జస్ట్ ` అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. అమితాబ్‌ తెలుగులో ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ చిత్రంలో నటించనున్నారు.