అమితాబ్ బచ్చన్, జయాబచ్చన్ లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాదాపు 46 ఏళ్లుగా తమ వైవాహిక జీవితంలో ఈ జంట సతోషంగా ఉంది. అయితే జయను అమితాబ్ అనుకోకుండా పెళ్లి చేసుకున్నాడట.

ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించాడు. తాను ఫారిన్ టూర్ వెళ్లడం కోసం హడావిడిగా జయను పెళ్లి చేసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. అమితాబ్ కెరీర్ లో అతి పెద్ద హిట్ చిత్రాల్లో 'జంజీర్' ఒకటి. ఆ సినిమా సక్సెస్ అయితే తన మిత్రుల్ని లండన్ టూర్ కి తీసుకెళ్తానని మాట ఇచ్చాడట.

సినిమా అనుకున్నదానికంటే పెద్ద సక్సెస్ కావడంతో టూర్ కి రెడీ అయ్యారట. తన మిత్రులతో పాటు జయను కూడా వెంట తీసుకెళ్లాలని అనుకున్నాడట. అప్పటికే ఆమెతో ప్రేమలో ఉన్నాడు అమితాబ్. కానీ ఆమెతో పెళ్లి కాకుండా విదేశాలకు తీసుకువెళ్లడానికి అమితాబ్ తండ్రి ఒప్పుకోలేదట.

దీంతో అప్పటికప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోయినా తండ్రి మాట ప్రకారం పెళ్లి చేసుకొని ఆ మరుసటిరోజే ఆమెని, తన స్నేహితులను తీసుకొని విమానం ఎక్కేసినట్లు అమితాబ్ చెప్పుకొచ్చాడు.