Asianet News TeluguAsianet News Telugu

Amitabh Bachchan: కూతురు కోసం ఇల్లు ఖాళీ చేస్తున్న అమితాబ్ బచ్చన్, కారణం ఏంటీ..?

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కూతురు కోసం ఆయన తను ఎంతగానోప్రేమించే ఇంటిని వదిలి వెళ్ళిపోబోతున్నారు. ఇంతకీ కారణం ఏంటంటే...?
 

Amitabh Bachchan gifts his Juhu bungalow Prateeksha to daughter Shweta Nanda JMS
Author
First Published Nov 25, 2023, 8:19 AM IST

80 ఏళ్లు దాటినా.. కుర్రాళ్లకంటే హుషారుగా సినిమాలు చేస్తున్నాడు బిగ్ బి అమితాబ్ బచ్చన్. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ లో పెద్దగా సినిమాలు లేవు కాని... సౌత్ లో మాత్రం వరుస సినిమాలతో అలరిస్తున్నారు. ప్రస్తుతం అమితాబచ్చన్ తెలుగు నుంచి పార్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న కల్కీ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈసినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా.. దీపికాపదుకునే హీరోయిన్. ఇక ఈసినిమాతో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ 170 వ సినిమాలో కూడా ఆయన సందడి చేయబోతున్నారు. 

వీటితో పాటు బాలీవుడ్ లో ఎన్నో ఏళ్లుగా ఆడియన్స్ ను అలరిస్తున్న పాప్యురల్ టీవీ షో ‘కౌన్ బనేగా క్రోర్‌పతి 15’కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈక్రమంలో బిగ్ బీ అమితాబ్ కు సబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన తీసుకున్న షాకింగ్ డెసిషన్ కు అంతా ఆశ్చర్యపోతున్నారు.బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకెంతో ఇష్టమైన జుహు బంగ్లా ప్రతీక్షను కుమార్తె శ్వేతా బచ్చన్‌నందాకు బహుమతిగా ఇచ్చేశారు.

Amitabh Bachchan gifts his Juhu bungalow Prateeksha to daughter Shweta Nanda JMS

ముంబై జుహు ప్రాంతం అత్యంత ఖరీదైనప్రాంతం. ఇక్కడ  ప్రతీక్షలో  అమితాబ్ బచ్చన్ కు రెండు ప్లాట్లు ఉన్నాయి. ఈ ఇల్లు అంటే ఆయనకు చాలా ఇష్టం అంతే కాదు తన తల్లిదండ్రులు తేజీ, హరివంశ్‌రాయ్ బచ్చన్‌తో కలిసి అమితాబ్ మొదట ఇక్కడే ఉండేవారు. ఈఇంటిని తనకూతురు కు ఇవ్వడంతో పాటు రిజిస్టేషన్ ప్రక్రియ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది.  ఈ నెల 8నే గిఫ్ట్‌డీడ్ జరిగిందని, అందుకోసం స్టాంప్ డ్యూటీగా 50.65 లక్షలు చెల్లించినట్టు మనీ కంట్రోల్ రాసుకొచ్చింది.

నా భార్య నన్ను కొడుతుంది.. ఆలియా భట్ పై రణ్ బీర్ కపూర్ కామెంట్స్ వైరల్

ఇక బిగ్ బీ అమితాబ్ ముంబయ్ లో మరిన్ని ఆస్తులు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. 81 ఏళ్ల అమితాబ్ ఈ ఏడాది జులైలో ముంబై అంధేరిలో ఉన్న ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లోని 21వ అంతస్తులో నాలుగు ఫ్లాట్లను కొన్నారు. అయితే  ఆప్టాట్  ఒక్కోదానిని విలువ  7.18 కోట్లు ఉంటుందట.  అలాగే, కొన్నేళ్ల క్రితం ముంబైలోని అట్లాంటిస్‌లో 31 కోట్లతో 5,184 చదరపు అడుగుల స్థలాన్ని కొన్నారు. ఇలా అమితాబ్...ముంబయ్ లోనే కాదు.. ఇతర ప్రాంతాల్లో కూడా స్థిరాస్తులు కడబెట్టారు. ఇక బాలీవుడ్ లో అమితాబ్ చివరిసారి టైగర్ ష్రాఫ్ సినిమా గణపతి లో కనిపించారు. ఇక ప్రస్తుతం సౌత్ లో బిజీ అవుతున్నారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios