తన భార్య ఆలియా భట్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు బాలీవుడ్ యంగ్ హీరో రణ్ బీర్ కపూర్. తనను తన భార్య కొడుతుందంటూ ఆయన చేసి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆయన ఎందుకు ఆమాట అన్నారు.
డిసెంబర్‌లో రిలీజ్ కు రెడీగా ఉంది రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా. డిసెంబర్ 1న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ లో వేగ పెంచింది. ఇప్పటికే దేశమంతా తిరుగుతూ ప్రమోషన్ల జోరుగా చేస్తున్న టీమ్.. తాజాగా ఈమూవీపై అంచనాలు పెంచుతూ..యానిమల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కోసం ఒక ఈవెంట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్‌లో సినిమా గురించి మాత్రమే కాకుండా, తన పర్సనల్ లైఫ్ గురించి పలు కూడా పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు రణబీర్ కపూర్.
అయితే ఈ ఈవెంట్‌లో తన భార్య ఆలియా భట్ గురించి కూడా ప్రస్తావించాడు.తనపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమాలో తన పాత్రలతో తను చాలా డిటాచ్ ఉంటానని రణబీర్ క్లారిటీ ఇచ్చాడు. అది తమను ప్రేమించి వారిపై మంచి ప్రభావం చూపించదని అన్నాడు. అంతే కాకుండా నేను ఇంటికి వెళ్లి ఇలాగే ప్రవర్తిస్తే నా భార్య నన్ను కొడుతుంది అని ఫన్నీ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు. ఇక యానిమల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగాతో పాటు బాబీ డియోల్, రష్మిక కూడా హాజరయ్యారు. ఇక ఈ ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మూవీ టీమ్.. దీని సక్సెస్‌పై మరింత నమ్మకంతో ఉన్నారు.
రామ్ చరణ్ ఫెర్రారీ కారు... కాస్ట్ ఎంతో తెలిస్తే కళ్ళు తిరగాల్సిందే...
ఇప్పటికే రిలీజ్ కు ముందే రికార్డ్ సాధించింది యానిమల్ సినిమా. ఏ సినిమాకు లేనంతగా 3 గంటల 21 నిమిషాల నిడివితో యానిమల్ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ విషయాన్ని సందీప్ వంగా స్యవంగా ప్రకటించాడు. అలా ప్రకటించగానే.. ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. కొందరైతే డ్యూరేషన్ చూసే సినిమా ఫ్లాప్ అని డిసైడ్ చేసేశారు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత రణబీర్ యాక్టింగ్ యానిమల్ కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.
