బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఎమోషనల్ అయ్యారు. తాను అత్యంత ఆప్తుడిని కోల్పాయాను అంటూ కన్నీరు పెట్టుకున్నారు. అమితాబ్ బచ్చన్ ఇంతలా వేదనకు గురికావడానికి కారణం ఉంది. అమితాబ్ వద్ద గత 40 ఏళ్లుగా మేనేజర్ గా పనిచేస్తున్న శీతల్ జైన్(77) మృతి చెందారు. శీతల్ జైన్ అమితాబ్ కు వ్యక్తిగత కార్యదర్శి. శీతల్ మృతి చెందడంతో అమితాబ్ అతడి గురించి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 

దాదాపు 40 ఏళ్ల పాటు శీతల్ నా వృత్తికి సంబంధించిన బాధ్యతలని భుజాలపై మోశారు. శీతల్ నా కష్టసుఖాలని సమానంగా పంచుకున్నారు. నేను చేయాల్సిన సినిమాలని, కార్యక్రమాలని శీతల్ దగ్గరుండి చూసుకునేవారు. ఆయన మరణించడంతో మా ఇంట్లో వ్యక్తిని కోల్పోయినట్లు ఉంది. నేను కొన్ని కారణాల వల్ల ఏదైనా కార్యక్రమానికి హాజరు కాలేకపోతే మా ఫ్యామిలీ తరుపున ఆయన వెళ్లేవారు. ఇప్పుడు నా ఆఫీస్ లో ఆయన లేని లోటు తీర్చలేనిది అంటూ బిగ్ బి ఎమోషనల్ అయ్యారు. 

శీతల్ అంతయక్రియలకు అమితాబ్ ఫ్యామిలోకి మొత్తం హాజరైంది. శీతల్ మేనేజర్ గా పనిచేసిన సమయంలో తనకు ఎలాంటి వృత్తి పరమైన సమస్యలు ఎదురుకాలేదని అమితాబ్ తెలిపారు.