తన భార్యంటే భయం అంటున్నఅమితాబచ్చన్, ఇంతకీ జయబచ్చన్ ఎలా భయపెడుతుందంటే...?
తన భార్య జయాబచ్చన్ అంటే భయం అంటున్నాడు బిగ్ బీ అమితాబచ్చన్. ఆమె చాలా స్ట్రిక్ట్ అంటూ అమితాబ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
80 ఏళ్ల వయస్సులో కూడా ఏమాత్రం జోరు తగ్గలేదు బిగ్ బీ అమితాబ్ కు. అటు వెండితెరపై.. ఇటు బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతూ.. అభిమానులకు అలరిస్తూనే ఉన్నాడు. నటనకు ఏజ్ తో సబంధం లేదు అంటూ.. ఊపిరి ఉన్నంత వరకూ నటుడిగానే కొనసాగుతాను అంటున్నాడు బిగ్ బీ. ఇక బిగ్ బీ దాదాపు దశాబ్దానికి పైగా హోస్ట్ గా కొనసాగుతున్న కౌన్ బనేగా కరోడ్ పతీ షో.. ప్రస్తుతం తాజా సీజన్ ను సక్సెస్ ఫుల్ గా జరుపుకుంటుంది. బిగ్ బీ అభిమానులకు ఎన్నో స్వీట్ మెమోరీస్ ను అందించింది ఈ షో.
ఇక ఈషో హోస్ట్ గా అమితాబ్ వండర్స్ క్రియట్ చేశాడు. అనేక విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సరదా విషయాలనూ అభిమానులతో షేర్ చేసుకుటూవస్తున్నారు. ఇక తాజా షోలో ఆయన తనకు భార్య జయా బచ్చన్ కు సబంధించిన సీక్రేట్ ఒకటి వివరించారు. తనకు తన భార్య అంటే భయమని సరదాగా వ్యాఖ్యానించారు బిగ్ బీ. అమె తన విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుందని చెప్పుకొచ్చారు.
తాజాగా జరుగుతున్న సీజన్ 40 ఎపిసోడ్‌లో ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బిగ్ బీ వరుసగా కంటెస్టెంట్‌తో మాట్లాడుతూవస్తున్నారు. ఓ మహిళ తో అమితాబ్ మాట్లాడుతుండగా.. ఆమె తానో టీచర్ అని పరిచయం చేసుకుంది.. . తను టీచర్‌గా ఉన్నప్పుడు స్ట్రిక్ట్‌గా ఉంటానని, ఇతర సమయాల్లో మాత్రం సరదాగా ఉంటానని చెప్పుకొచ్చింది. అనంతరం జయా బచ్చన్ నిజ జీవితంలో మీతో ఎలా ఉంటారని బిగ్ బీని ప్రశ్నించింది. దీంతో కాస్త ఆలోచించిన ఆయన.. కొద్ది సేపు మౌనంగా ఉండిపోయాడు. ఆతరువాత సమాధానంచెపుతూ...ఆమె స్ట్రిక్ట్‌గానే కాకుండా సరదాగా ఉంటుందని సమాధానమిచ్చారు. హమ్మయ్య.. నేను పెద్ద ప్రమాదం నుంచే తప్పించుకున్నా.. అంటూ సరదా కామెంట్లు చేశారు.
ఇక అంతటితో ఆగకుండా.. అసలు విషయాన్ని మెల్లగా బయటపెట్టారు అమితాబ్. ఆమె నాతో స్ట్రిక్ట్‌గానే ఉంటుంది. అయినా ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతారు. ఆమెతో కలసి ఈ షో చూసేటప్పుడు నాకు దబిడిదిబిడే. ఆ సీన్ తలుచుకుంటేనే నాకు భయం. అందుకే వ్యక్తిగత విషయాల గురించి పెద్దగా బయటకు చెప్పను’’ అంటూ అమితాబ్ సరదాగా కామెంట్ చేశారు. సమాజ్‌వాదీ పార్టీ నేత జయా బచ్చన్ ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు.