బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ ప్రేమలో పడ్డారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. అది కూడా  తన ఫిట్నెస్ ట్రైనర్ తో ఎఫైర్ పెట్టుకున్నారట. కొన్నాళ్లుగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని బాలీవుడ్ మీడియా కథనాల సారాంశం.  ఐరా ఖాన్ గతంలో మిషాల్ అనే వ్యక్తిని ప్రేమించారు. కొంత కాలం వీరు చెట్టాపట్టాలేసుకొని తిరగడం జరిగింది. ఆ తరువాత మనస్పర్థలు రావడంతో  మిషాల్, ఐరా ఖాన్ విడిపోయారు. 

మిషాల్ తో బ్రేకప్ తరువాత ఐరా ఖాన్ తన ఫిట్నెస్ ట్రైనర్ నుపూర్ షిఖరే ప్రేమలో పడ్డారట. నుపూర్ షిఖరే మనస్తత్వం తెలిసిన మనస్థత్వం, ప్రవర్తన నచ్చిన ఐరా అతని ఇష్టపడ్డారట. దీనితో వీరిమధ్య ప్రేమ బంధం మొదలైందట. కొంత కాలంగా నుపూర్-ఐరా డేటింగ్ కూడా చేస్తున్నారని సమాచారం. ఇక అమీర్ ఖాన్ ఫార్మ్ హౌస్ లో వీరు ఫ్రెండ్స్ తో కలిసి ప్రైవేట్ పార్టీలు చేసుకుంటున్నారట. 

తన ప్రేమ విషయం ఐరా ఖాన్ తన తల్లి రీనా దత్తకు కూడా చెప్పారట. ఐరా ప్రేమను రీనా దత్త కూడా అంగీకరించారని వినికిడి. అమీర్ ఖాన్ మొదటి వివాహంగా రీనా దత్తను 1986లో వివాహం చేసుకున్నారు. వీరికి జునైద్ ఖాన్, ఐరా ఖాన్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2002లో రీనా-అమీర్ ఖాన్ విడాకులు తీసుకొని విడిపోవడం జరిగింది. అప్పటి నుండి పిల్లలు తల్లిదగ్గరే పెరుగుతున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Popeye ⚓ (@nupur_shikhare)