మరో ఐదు రోజుల్లో ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)విడుదల కావాల్సి ఉండగా... ప్రమోషన్స్ భారీ ఎత్తున నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఆర్ ఆర్ ఆర్ ప్రమోషనల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. నేడు ఢిల్లీలో ఆర్ ఆర్ ఆర్ ఈవెంట్ జరగనుండగా అమిర్ ఖాన్ ముఖ్య అతిథిగా రానున్నారు.
ఆర్ ఆర్ ఆర్ మూవీపై దేశం మొత్తం హైప్ నెలకొని ఉంది. చాలా కాలంగా ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ మార్చి 25న ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా రికార్డు థియేటర్స్ లో ఆర్ ఆర్ ఆర్ విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రమోషన్స్ భారీగా నిర్వహిస్తున్నారు. నేడు దేశ రాజధాని ఢిల్లీలో ఆర్ ఆర్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్(Amir Khan) హాజరుకానున్నారు. దీంతో ఆర్ ఆర్ ఆర్ ఢిల్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రాధాన్యత సంతరించుకుంది.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ రికార్డు ఓపెనింగ్స్ సాధించనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే $2 మిలియన్ మార్క్ కి దగ్గరైంది ఆర్ ఆర్ ఆర్. తెలుగుతో పాటు హిందీ, తమిళ,కన్నడ మలయాళ భాషల్లో ఆర్ ఆర్ ఆర్ కి విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది. ఇక అమిర్ ఖాన్ వంటి స్టార్స్ ఆర్ ఆర్ ఆర్ ఈవెంట్ కి రావడం సినిమాకు మరింత ప్రచారం దక్కనుంది.
2022 జనవరిలో ఆర్ ఆర్ ఆర్ విడుదల కావాల్సి ఉండగా... గతంలో కూడా ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహించారు. అప్పుడు సల్మాన్ ఖాన్ ఆర్ ఆర్ ఆర్ ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. మొత్తంగా రాజమౌళి తనే నిర్మించిన బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ చేయడం కోసం అన్ని రకాల ప్రణాళికలు వేస్తున్నారు. ఇప్పటికే బాహుబలి ని మించిన చిత్రం ఆర్ ఆర్ ఆర్ అవుతుందని ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
నిర్మాత డివివి దానయ్య రూ. 400 కోట్లకు పైగా బడ్జెట్ తో ఆర్ ఆర్ ఆర్ నిర్మించారు. ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్(Ram charan) లు హీరోగా నటిస్తున్నారు. చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తున్నారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా... అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
