మహాభారతం సినిమాలో నటించాలి.. ఆ అద్భుత కావ్యాన్ని సినిమాగా తెరకెక్కించాలి అంటూ స్టార్ నటీనటులు దర్శకులు ఎంతగా చెబుతున్నా ఆ కాన్సెప్ట్ సెట్స్ పైకి రావడం లేదు. అప్పటి జనరేషన్ నటులు టెక్నీషియన్స్ ఎమోషన్ తో బాగానే ప్రజెంట్ చేశారు కానీ ఇప్పుడు ఎమోషన్స్ తో పాటు యాక్షన్ కూడా చాలా అవసరం. జక్కన్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నప్పటికీ అది తీస్తాడా లేదా అన్న విషయంలో క్లారిటీ లేదు. 

అయితే అమిర్ ఖాన్ మాత్రం తప్పకుండా బాహాబారతంలో నటించాలని ముందు నుండి చెబుతూనే ఉన్నాడు. అంతే కాకుండా ముందుండి అ ప్రాజెక్టును 7 సిరీస్ లుగా నడిపించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రీసెంట్ గా ఆయన నుంచి వచ్చిన థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మూడు రోజుల కలెక్షన్స్ తప్పితే సినిమాకు వచ్చిన లాభమేమి లేదు. పీకే - దంగల్ సినిమాల తరువాత అమిర్ చేసిన సినిమా ఇలా ఉంటుందని ఎవరు ఊహించలేదని '2000 కోట్ల మార్కెట్ ఉన్న హీరో చేసినా సినిమానేనా? ఇది' అంటూ కామెంట్స్ వస్తున్నాయి. 

దీంతో అమిర్ మహాభారతంను లైన్ లో పెట్టి బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేయడానికి ఫిక్స్ అయినట్లు సమాచారం. అమెరికాలో తన రైటర్స్ తో స్పెషల్ గా కథకు సంబందించిన చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే రిలయన్స్ అంబానీ తో 1000కోట్ల బడ్జెట్ కు అమిర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. డబ్బుకు ఎలాంటి ఇబ్బంది లేదు గనక వీలైనంత త్వరగా ఏడుగురి దర్శకులతో ప్రాజెక్టు షూటింగ్ కు ప్లాన్ చేస్తున్నాడట. ఒక్కో సిరీస్ కు ఒక్కో దర్శకుడన్నమాట. 

ఇక అమిర్ ఖాన్ కృష్ణుడు వేషం వేస్తున్నట్లు ముందే చెప్పేశాడు. మహాభారతంలో బలమైన పాత్రలు చాలా ఉన్నాయి కాబట్టి కేవలం నార్త్ నుంచే కాకుండా ఇతర భాషలు నుంచి కూడా నటీనటులను తీసుకోవాల్సి ఉంటుంది. ఇక వెబ్ సిరీస్ గా ప్లాన్ చేస్తారా లేక వెండితెరపై హాలీవుడ్ తరహాలో 7 భాగాలుగా సినిమాను నిర్మిస్తారా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. మరి అమిర్ ఏ విధంగా అడుగులువేస్తాడో చూడాలి.