Amigos Trailer: అమిగోస్ ట్రైలర్.. త్రిపుల్ రోల్లో కళ్యాణ్ రామ్ విశ్వరూపం..
కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో విశ్వరూపం చూపించబోతున్నారు. తాజాగా ఈ రోజు సాయంత్రం `అమిగోస్` చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు.

`బింబిసార`తో హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్.. ప్రయోగాత్మక, డిఫరెంట్ మూవీస్ చేస్తున్నారు. తాజాగా ఆయన `అమిగోస్` అనే సినిమాతో రాబోతున్నారు.రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 10న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలు పెంచింది. కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో నటిస్తుండటంతో మరింత ఆసక్తి పెరిగింది. మరోవైపు విడుదలైన పాటలు ఆకట్టుకన్నాయి.
శుక్రవారం సాయంత్రం విడుదలైన ట్రైలర్ సైతం ఆసక్తిగా సాగింది. ఎంతో సస్పెన్స్ తో, ఆసక్తిని రేకెత్తించేలా ట్రైలర్ ని డిజైన్ చేశారు. కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో కనిపించగా, ఓ పాత్ర డెవిల్ తరహాలో ఉండటం విశేషం. మరి ఈ ముగ్గురు ఎందుకు కలుసుకున్నారు? అనేది ఇంట్రెస్ట్ గా మారింది. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో `
అతను ఇండియన్ పాబ్లో ఎస్కోబోరా.. నైట్ మేర్ టూ ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ.. ఎట్టిపరిస్థితుల్లో మిస్ అవకూడదు` అనే బ్యాక్ గ్రౌండ్ వాయిస్‌తో ట్రైలర్ మొదలైంది. ఆ తర్వాత హీరోయిన్ ని చూసినప్పుడు కళ్యాణ్ రామ్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ చూసి, `సోమాలియా కరువు బాధితుల్లా ఆ ఆకలి చూపులేంట్రా.. తినేస్తావా ఆ అమ్మాయిని` అని బ్రహ్మాజీ చెప్పడం బాగుంది.
హీరోని చూసి `నీలాంటి వాళ్లు నీ చుట్టూ వెయ్యి మంది ఉన్నా ఇట్టే గుర్తు పట్టేస్తా.. అని చెప్పే లోపే కళ్యాణ్ రామ్‌ని పోలిన మరో వ్యక్తి రావడంతో `అతను కూడా మీలాగే ఉన్నాడు..` అంటూ హీరోయిన్ ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత `మనిషిని పోలిన మనుషులు సినిమాల్లోనే ఉంటారు, రియల్ లైఫ్‌లో ఉండరు` అని బ్రహ్మాజీ చెప్పగా, `ఇక్కడున్న మీ వాడు ఎక్కడో ఉంటే, డాపుల్‌గ్యాంగర్` అని సప్తిగిరి చెప్పారు. అప్పుడు మరో కళ్యాణ్ రామ్ ఎంట్రీ ఇస్తారు. `మనుషులను పోలిన మనుషులు ఎదురుపడితే అరిష్టం` అంటారని వాళ్లమ్మ చెప్పడంతో ఫన్నీగా సాగిన ట్రైలర్ సీరియస్‌గా మారిపోయింది.
`మనం ఫ్రెండ్స్ కాదు, బ్రదర్స్ అంత కన్నా కాదు, కేవలం చూడ్డానికి ఒకేలా ఉన్నామంతే` అంటూ చివర వచ్చిన కళ్యాణ్ రామ్ చెప్పడం గమనార్హం. `ఓ రాక్షసుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావ్ కదరా..` అని వాళ్ల నాన్న మొదటి కళ్యాణ్ రామ్‌ని అడగ్గా, `ఎన్‌ఐఏ చీఫ్ ఇంత టెన్షన్ పడుతున్నాడంటే అసలు ఎవడీ బిపిన్` అని చెప్పడం, చివరగా `డెవిల్ ఇన్ ద డార్క్. నేను ఎవరినీ బెదిరించను, జస్ట్ చంపేస్తా.. ` అని కళ్యాణ్ రామ్ చెప్పడం బాగుంది. ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతుంది. సినిమాలో ఏం చెప్పబోతున్నారనే ఆసక్తి పెరిగింది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కర్నూల్లో ఈ సాయంత్రం నిర్వహిస్తుండటం విశేషం.