రామ్ చరణ్ కు అమెరికన్ నటి క్షమాపణలు చెప్పారు. షాకింగ్ గా ఉంది కదా.. టాలీవుడ్ యంగ్ హీరోకు.. హాలీవుడ్ సీనియర్ నటి సారీ చెప్పడం ఏంటీ అని ఆశ్చర్యంగా ఉండొచ్చు.. అసలు విషయం ఏంటీ అంటే..? 

రామ్ చరణ్ కు అమెరికన్ నటి టిగ్ నొటారో క్షమాపణలు చెప్పారు. అవును క్రిటిక్స్ అవార్డుల వేడుక సందర్భంగా.. అంతర్జాతీయ వేదికపై చరణ్ కు సారీ చెప్పింది నటి. చరణ్ పేరు ఎలా పలకాలో తెలియడం లేదంటూ సారీ చెప్పారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. అందరిని ఆశ్చర్యపరిచిన ఈ సంఘటనకు సబంధించిన వివరాలు చూస్తే..? 

అంతర్జాతీయ వేదికపై సత్తాచాటింది ఆర్ఆర్ఆర్ మూవీ. ఒకేసారి నాలుగు అవార్డ్స్ ను సాధించి షాక్ ఇచ్చింది. ఈ సందర్భంగా అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొనేందుకు రామ్ చరణ్ వెళ్లారు. ఈ వేడుకలో రామ్ చరణ్ కు ప్రత్యేక గౌరవం లభించింది. ఓ అవార్డ్ కు రామ్ చరణ్ ప్రజెంటర్ గా వ్యవహిరించారు. అయితే ఆయన హాలీవుడ్ నటి అంజలి భీమానీతో కలిసి స్టేజ్ పైకి రావాల్సి ఉంది.

ఇక వారిద్దరినీ ఆహ్వానించే పని హాలీవుడ్ నటి టిగ్ కు అప్పగించారు. ఆటైమ్ లో.. టిగ్ నొటారో తడబడ్డారు. ఆర్ఆర్ఆర్ తో విజయం అందుకున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్టార్ రామ్.. అని కొంచెం గ్యాప్ ఇచ్చారు. చివరి పేరు ఎలా పలకాలో తెలియడం లేదన్నారు. మైక్రో ఫోన్ లో వెనుక నుంచి పేరు చెప్పడంతో చ్చరాన్ అన్నారు. తనకు పక్క నుంచి సాయం చేశారని చెప్పారు. తర్వాత కూడా రామ్ చరాన్ అన్నారు. 

Scroll to load tweet…

తర్వాత అంజలి భీమానీ పేరు పలకడంలోనూ ఇబ్బందిపడ్డారు. అంజలీ.. భీమానీ అంటూ గ్యాప్ ఇచ్చి పేరు పలికారు. దీంతో ఆడియన్స్ నవ్వేశారు. ఇక వారిద్దరూ స్టేజ్ ఎక్కి వస్తుండగా ఎదురెళ్లిన హాలీవుడ్ స్టార్ యాక్ట్రస్ టిగ్ నొటారో.. రామ్ చరణ్ కు క్షమాపణలు చెప్పారు. తనకు నోరు తిరగకపోవడంతో.. ఇది జరిగిందని వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ఏది ఏమైనా ఈ కార్యక్రమంతో ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్టార్ గా రామ్ చరణ్ మారిపోయాడు. ఇలా స్టేజ్ పైకి చరణ్ ను పిలవడం మెగా ఫ్యాన్స్ దిల్ ఖుషీ అవుతున్నారు. అంతర్జాతీయ వేదికపై ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని చరణ్ చేతుల మీదగా ఇవ్వడం టాలీవుడ్ తో పాటు ఇండియన్ ఇండస్ట్రీకే దొరికిన గౌరవంగా భావిస్తున్నారు అంతా. ఇక ఆర్ఆర్ఆర్ అత్యధిక అవార్డు లతో ఇంటర్నేషనల్ లెవల్లో సత్తా చాటుకుంటుంది. ఆస్కార్ కు అడుగు దూరంలో ఉంది మూవీ.