బద్రి సినిమాలో సరయు అనే పాత్ర ఎంత సున్నితంగా ఉంటుందో టాలీవుడ్ ఆడియెన్స్ కి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అమాయకపు చూపులతో అందరికి షాకిచ్చిన అమీషా పటేల్ తొందరగానే బాలీవుడ్ లో అవకాశాలను అందుకుంది. అక్కడ వరుస ఆఫర్స్ తో ఒక దశ వరకు తన రేంజ్ ని మెయింటైన్ చేసింది. 

కానీ పోటీ ప్రపంచంలో కుర్ర హీరోయిన్స్ గ్లామర్ ముందు అమ్మడు ఎక్కువ కాలం నిలవలేకపోయింది. అమీషా ఇప్పుడు 42లోకి వచ్చేసింది. అయినప్పటికీ ఏ మాత్రం తగ్గకుండా ఘాటు అందాల డోస్ పెంచేసింది. గ్లామర్ హీట్ పెంచేసి సోషల్ మీడియాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది.

అప్పుడపుడు స్పెషల్ సాంగ్స్ లలో కనిపిస్తున్న అమీషా ఈ వయసులో కూడా గ్లామర్ తో ఎటాక్ చేస్తూ మరిన్ని అవకాశాలను టార్గెట్ చేసింది. ప్రస్తుతం ఓ బాలీవుడ్ సినిమాతో బిజీగా ఉన్న బేబీ కుదిరితే టాలీవుడ్ లో కూడా మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

💋💋🌈🌈🌈🌈

A post shared by Ameesha Patel (@ameeshapatel9) on Jun 6, 2019 at 12:25am PDT