బోల్డ్ బ్యూట్య్ అమీషా పటేల్ గురించి పరిచయం అక్కర్లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి చిత్రంతో అమీషా పటేల్ హీరోయిన్ గా పరిచయం అయింది.
బోల్డ్ బ్యూట్య్ అమీషా పటేల్ గురించి పరిచయం అక్కర్లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి చిత్రంతో అమీషా పటేల్ హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో అమీషా పటేల్ కు తెలుగులో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి కూడా.
కానీ అమీషా పటేల్ టాలీవుడ్ లో ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. బాలీవుడ్ లో కూడా ఆమెకు అంతాగా కలసి రాలేదు. స్టార్ హీరోయిన్ రేంజ్ లో పాపులర్ కాలేకపోయినప్పటికీ అవకాశాలు దక్కించుకుంది. ఇక అమీషా పటేల్ కి సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.
47 ఏళ్ల వయసులో కూడా అమీషా పటేల్ కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయే బరువైన పరువాలతో ఆమె నిత్యం చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అమీషా పటేల్ బోల్డ్ ఫొటోస్ తరచుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఇదిలా ఉండగా అమీషా పటేల్ తాజాగా నటిస్తున్న చిత్రం గదర్ 2. సన్నీ డియోల్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
ఆగష్టు 11న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. అనిల్ శర్మ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా నిర్మాతలపై అమీషా పటేల్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నారు. అనిల్ శర్మ సంస్థ నటీనటులకు కనీస వసతులు కూడా ఏర్పాటు చేయలేదని ఆరోపించింది.
ఆహారం, రవాణా, వసతి ఎలాంటి సౌకర్యాల గురించి నిర్మాతలు పట్టించుకోలేదు. దీనితో నటీనటులు ఎంతో ఇబ్బంది పడ్డారు. మేకప్ ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు, ఇతర సిబ్బందికి నిర్మాతలు ఇంతవరకు బకాయిలు కూడా చెల్లించలేదు. నటులకు ఫ్లైట్ చార్జీలు చెల్లించలేదు సరికదా కనీసం కారు సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదు. చాలా సందర్భాల్లో మమ్మల్ని షూటింగ్ లొకేషన్ లోనే ఒంటరిగా వదిలేశారు. జీ స్టూడియోస్ వారు మాత్రమే తమని పట్టించుకుని సౌకర్యాలు కల్పించినట్లు అమీషా పటేల్ పేర్కొంది. ఆగష్టు 11న ఈ చిత్రం రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అమీషా పటేల్ వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో. దీనిపై అనిల్ శర్మ ప్రొడక్షన్స్ స్పందించాల్సి ఉంది. జీ స్టూడియోస్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి.
